మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే తలలు నరికేస్తాం అని జనసేన పార్టీ నాయకుడు మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా రాప్తాడు లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి పలువురు మాట్లాడుతుండగా జనసేన పార్టీ ముఖ్య నాయకుడైన మురళి వేదికపైకి వచ్చి పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలబడి పవన్ ఆదేశిస్తే నరకడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాప్తాడు ఎమ్మెల్యే అయినా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల కూడా అడుగుతానన్నాడు. వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు తప్పు అలా మాట్లాడకూడదు అని చెప్పకుండా నవ్వుతూ కూర్చుండిపోయారు. ప్రస్తుతం ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
