Home / ANDHRAPRADESH / చంద్రబాబు బ్యాచ్‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..!

చంద్రబాబు బ్యాచ్‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రెండు రోజుల కిందట మార్షల్స్‌పై బాస్టర్డ్స్ అంటూ నోరుపారేసుకుంది కాగా, పైగా తనకే అవమానం జరిగింది…ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలని బుకాయించాడు. దిశ చట్టంపై మాట్లాడుతూ… వైసీపీ ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యేలు అరాచకం చేస్తున్నారంటూ…బాబు తీవ్ర విమర్శలు చేశాడు. ఇవాళ రివర్స్ టెండరింగ్‌ కాదు ప్రభుత్వం తెచ్చిన రిజర్వ్ టెండరింగ్ అంటూ అసెంబ్లీలో రివర్స్ వాక్ డ్రామా చేశాడు. తాజాగా మద్యనిషేదంపై బాబు ఆరోపణలకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. చంద్రబాబు విజన్ 2020 కాదు.. విజన్ 420 అని రోజా ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో రూ. 75వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని, మరి చంద్రబాబుకు మద్యం అంటే అంత మక్కువ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. మద్యం వల్ల పేదవాళ్ల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది కుటుంబాలు అన్యాయమైపోయాయని మండిపడ్డారు.అయితే ఇప్పుడు మద్యం రేట్లు పెరిగాయి కదా తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు పలకరిస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. మద్యం ధరలు పెరగడంతో మందుబాబులు బట్టలు, చెప్పులు కొనుక్కోలేని పరిస్థితిలోకి వెళ్లారని చంద్రబాబ అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. మొన్న ఉల్లి ధర పెరిగిందని మెడలో ఉల్లిపాయలు వేసుకొచ్చారని.. ఇప్పుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మద్యం ధరలు పెరిగాయని.. మద్యం సీసాలు మెడలో వేసుకొస్తారేమోనని తాను భయపడ్డానని రోజా ఎద్దేవా చేశారు.వెన్నుపోటు పొడిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏమీ.. ఎన్టీఆర్ కాదని రోజా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పులి అని అన్నారు. పులిహోర తిన్నంత మాత్రాన పులులు అయిపోరంటూ చంద్రబాబును ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ‘ఎన్ని కష్టాలు వచ్చినా, అక్రమ కేసులు బనాయించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజల హృదయాలను గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ ఆయన నెరవేర్చుతున్నారు. అలాం‍టివారిని పులి అంటారు కానీ… పులిహోర బ్యాచ్‌ను పులి అనరు’ అని ఆమె చంద్రబాబుతో సహా టీడీపీ నేతలపై అదిరిపోయే సెటైర్ వేశారు. ప్రస్తుతం చంద్రబాబు బ్యాచ్‌‌ను పులిహోర బ్యాచ్ అంటూ రోజా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat