డిసెంబర్ 21.. వైయస్ అభిమానులకు పండుగ రోజు అని చెప్పాలి. ఎందకంటే ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే. జననేత జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరపాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. దానికి సంబంధించి విజయవాడ నగరం ముస్తాబు అవుతోంది. సిమ్స్ కాలేజీ అధినేత బి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే సంబురాలు అంబురాన్ని అంటనున్నాయి. అంతేకాకుండా ఆరోజున ఆయన అధ్వర్యంలో సిమ్స్ కాలేజ్ క్యాంపస్ లో ఉదయం 9గంటలు నుండి సాయంత్రం 5 గంటలు వరకు అవయవ దానం మరియు మెగా మెడికల్ క్యాంపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ అడ్వైసర్ సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరవుతున్నారు.
