డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజును పునస్కరించుకుని సిమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణానదీతీరాన పద్మావతి ఘాట్‌లో నిర్వహించిన బర్త్‌డే సెలబ్రేషన్స్ రెండు రోజుల పాటు కన్నుల పండుగగా సాగాయి. ఈ సందర్భంగా భరత్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. గుంటూరులోని సిమ్స్ కళాశాల ప్రాంగణంలో భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన అవయవదానం మరియు ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. మొదటగా సిమ్స్ విద్యాసంస్థల అధినేత భరత్ రెడ్డి జీవన్ దాన్ ఆర్గాన్ డొనేషన్ ఫాంపై సంతకం చేసి, సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆర్గాన్ డొనేషన్ కార్డును అందుకున్నారు. అనంతరం భరత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, విద్యార్థిని, విద్యార్థులు దాదాపు 500 మంది ఆర్గాన్ డొనేట్ చేశారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌లో రోగులకు 3 నెలల ఉచిత కాన్సులేట్ కార్డు, రక్త పరీక్షలు, ఉచిత మందులను అందజేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ స్ఫూర్తితో చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిమ్స్ కాలేజీ అధినేత భరత్ రెడ్డిని అభినందించారు. సీఎం జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నభూతో నభవిష్యత్తుగా నిర్వహించిన భరత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. భరత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందని సజ్జల అన్నారు. మొత్తంగా సీఎం జగన్ బర్త్‌డే సందర్భంగా అవయవ దానం, మెగా మెడికల్ క్యాంప్‌ను నిర్వహించిన సిమ్స్ కాలేజీ అధినేత బి.భరత్ రెడ్డి సేవా నిరతికి గుంటూరు ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
