డిసెంబర్ 21 న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు సిమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణా నదీ తీరాన పద్మావతి ఘాట్‌లో రెండు రోజుల పాటు బర్త్‌డే వేడుకలను కన్నులపండుగా నిర్వహించిన సంగతి విదితమే. అంతే కాదు గుంటూరులోని సిమ్స్ కళాశాల ప్రాంగణంలో అవయవదానం మరియు ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్‌ను కూడా భరత్ రెడ్డి నిర్వహించారు. వైసీసీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి స్వయంగా అవయవదాన పత్రంపై సంతకం చేసి సజ్జల చేతులమీదుగా ఆర్గాన్ డోనర్ కార్డు అందుకున్నారు. కాగా భరత్ రెడ్డి సతీమణి, గుంటూరుకు చెందిన సిమ్స్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి. శివశిరీష ఆధ్వర్యంలో బ్రిటన్‌లోని, మాంచెస్టర్ నిర్వహించిన సీఎం జగన్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు విదేశీ ప్రతినిధులు హాజరైన ఈ వేడుకల్లో సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ భారీ కేక్‌ను డాక్టర్ శివ శిరీష కట్ చేశారు. తదనంతరం శివ శిరీష మాట్లాడుతూ..ఏపీలోని పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదివేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. మహిళల భద్రతకు దిశ చట్టాన్ని తీసుకురావడం ద్వారా సీఎం జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీవైపు చూసేలా చేశారని శివశిరీష అన్నారు. ఈ వేడుకల్లో ఎన్నారైలు అభినవ్, గాయత్రి, మైక్, మెగాన్‌బేట్స్, కరియాన్ వాన్యాక్, రిచర్డ్‌బర్డ్, ఎమాకూపర్, నోరీన్‌లోటీ తదితర విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ సంస్థల తరపున పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో ఉన్న అనుకూల అంశాలపై శివశిరీష మాంచెస్టర్ నగరవాసులతో చర్చించారు. మొత్తంగా భరత్‌రెడ్డి దంపతులు సీఎం జగన్ బర్త్‌డే వేడుకలను విజయవాడ, గుంటూరులోనే కాకుండా బ్రిటన్‌లో కూడా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం.
