మూడు రాజధానుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషనల్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలతో సహా వివిధ పార్టీల నేతలు, ప్రజలు స్వాగతిస్తుండగా… చంద్రబాబు మాత్రం అమరావతి ముద్దు…మూడు రాజధానులు వద్దు…ఇదే తమ పార్టీ విధానమని ప్రకటించడంతో పాటు.. రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నాడు. తాజాగా రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిర్మించిన బ్యూటిఫుల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏపీ రాజధాని వ్యవహారంపై వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. అసలు తన దృష్టిలో రాజధాని అన్న పదానికి అర్ధమే లేదని వర్మ అన్నారు. ఏ అర్ధం లేనప్పుడు రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి?, చెన్నైలో ఉంటే ఏంటి?’ అంటూ వర్మ మీడియాకు ప్రశ్నలు కురిపించాడు. . రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిదన్నారు. ప్రజలకు నేరుగా పాలన అందాలనుకుంటే.. ప్రతి టౌన్‌కి ఒక క్యాపిటల్ ఉండాలని, అదే అభిమతమని రాంగోపాల్ వర్మ వింతగా స్పందించాడు. అయితే రాజధాని అమరావతిలో ఆందోళనలు చేయిస్తున్న చంద్రబాబుకు వర్మ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడని మనకు అర్థమవుతుంది. రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి అంటూ..మూడు రాజధానుల ఏర్పాటుకు పరోక్షంగా వర్మ మద్దతు పలికాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా ఏపీకి మూడు రాజధానుల విషయంలో రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుపై రాంగోపాల్ వర్మ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
