ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు 18 రోజులుగా ధర్నాలు, ర్యాలీలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలను టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, రాజధాని ప్రాంతంలోని టీడీపీ నేతలు పథకం ప్రకారం నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక రాజధానిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబుతోసహా, టీడీపీ నేతలు పాల్గొంటూ అమరావతి ఆందోళలను ఉద్యమంగా మల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజధాని సెంటిమెంట్ రగిలించేందుకు సేవ్ అమరావతి…సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో దీక్షలు చేస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయిగా రాజధాని ఉంటుందనే ప్రకటన వచ్చే వరకు ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించిన టీడీపీ పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒక్క రోజు దీక్ష చేసి…మరుసటి రోజుకు చేతులెత్తేశాడు. అసలు నిరాహార దీక్షలు చేస్తే కనీసం ఓ నాలుగురోజులైన చేస్తే ప్రభుత్వంపై వత్తిడి వస్తుంది..అంతలా ఆకలికి ఆగలేకపోతే గతంలో టీడీపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ నిరాహారదీక్షలను గుర్తు చేసుకుంటే చాలు..బాత్రూంకని వెళ్లి బిర్యానీలు లాగించవచ్చు..లేకుంటే నైట్ సీక్రెట్‌గా కడుపు నిండా తినచ్చు..అయితే టీడీపీ నేతలు మాత్రం ఒక్కరోజు కూడా ఓపిక పట్టలేకపోతున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒక రోజు దీక్ష చేసి, తెల్లారి నిమ్మరసం తాగి ఇంటికి వెళ్లిపోవడం చూసి ఇవేమి దీక్షలు అంటూ పెనమలూరు ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
తాజాగా మరో టీడీపీ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడా సేవ్ అమరావతి పేరుతో ఒక్క రోజు దీక్షకు దిగాడు..పొద్దున్నే ఫుల్లుగా తినేసి, దండేసుకుని దీక్షా శిబిరంలో కూర్చుని రాత్రి కాగానే ఇంటికి వెళ్లి బిర్యానీ లాగించడం.. టీడీపీ నేతలకే సాధ్యమై పోయింది.. ఇక పోతే ఈ ఒక్క రోజు దీక్షలకు బాబుగారు చీఫ్ గెస్ట్‌గా వచ్చి…షరామామూలుగా సీఎం జగన్‌ను శాపనార్థాలు పెట్టి అక్కసు వెళ్లగక్కడం కొసమెరుపు. అయినా చినబాబు లోకేష్ నాలుగు గంటలు, పెదబాబు చంద్రబాబు 12 గంటల పాటు ఇసుక దీక్షలు చేస్తున్నారు. మేం ఇంకా 24 గంటలు చేస్తున్నామంటూ టీడీపీ నేతలు అనుకుంటే అంతకంటే హాస్యాస్పదంగా ఉండేది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు 50 రోజులకు పైగా ఆమరణ దీక్షలు చేసి రాష్ట్రం కోసం అమరుడైతే…రాజధాని కోసం ఈ టీడీపీ నేతలు పట్టుమని 50 గంటలు కూడా చేయలేకపోతున్నారు…ఇంకా వీళ్లేం అమరావతి రాజధాని కోసం పోరాడుతారు..మొత్తంగా టీడీపీ నేతల ఒక్కరోజు దీక్షలు ప్రహసనంగా మారుతున్నాయి. అయినా ఈ దిక్కుమాలిన ఐడియా ఎవరు ఇచ్చారు..బాబు..ఈ ఒక్కరోజు నిరాహార దీక్షలేంటీ…అంటూ ప్రజలు నవ్వుతున్నా..టీడీపీ నేతలు మాత్రం మారడం లేదు…ఒకరి తర్వాత ఒకరు ఒక్క రోజు దీక్షలు చేసి పార్టీ పరువు నిండా ముంచుతున్నారు. అయినా యథా బాబు..తథా తమ్ముళ్లు..అంతేగా అంతేగా..