విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ విచ్చేసారు. సోమవారం నాడు అక్కడికి వెళ్ళిన జగన్ కు పూర్ణ కుంభంతో వేద పండితులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు తీసుకున్నారు జగన్. పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జగన్ జమ్మిచెట్టు ప్రదక్షిణచేసారు మరియు గోమాతకు నైవేద్యం సమర్పించారు. అక్కడ నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
