ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రచ్చ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. గత ఎన్నికలకు ముందు అమరావతి అనేది కలల రాజధాని కాదు…ఓ కులం కోసం కడుతున్న రాజధాని అని తీవ్ర స్థాయిలో విమర్శించిన పవన్ ఇప్పుడు అమరావతి పాట పాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నా మనసులో కర్నూలే రాజధాని అన్న పవన్ ఇప్పుడు అదే కర్నూలులో జగన్ సర్కార్ జ్యుడిషియర్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తుంటే వ్యతిరేకిస్తున్నారు. కర్నూలో హైకోర్టు వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయా..పరిశ్రమలు వస్తాయా అంటూ…పాలన అంతా అమరావతిలోనే జరగాలంటూ చంద్రబాబుకు వంత పాడారు
.
కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ముందు కర్నూలు రాజధాని కావాలని అడిగిన పవన్ కళ్యాణ్..ఇప్పుడు కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా? అనడం అతని అజ్ఞానానికి నిదర్శనమని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందంలోనే కర్నూలులో హైకోర్టు ఉండాలని ఉందన్న విషయాన్ని వెల్లంపల్లి గుర్తు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ బీజేపీతో చేరాడని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఓ పార్టీ అధినేత కాదని…ఆయనకు ఓ సిద్ధాంతం అంటూ లేదని… కేవలం బాబు మేలు కోసమే పనిచేసే వ్యక్తి అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు దగ్గర పవన్ గుమస్తాగా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏదంటే పవన్ అదే పాట పాడుతున్నారంటూ ధ్వజమెత్తారు..కర్నూలులో హైకోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయా అని అడుగుతున్నారు..అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిన మీ పార్టనర్ చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని పవన్‌ను ప్రశ్నించారు. మొత్తంగా చంద్రబాబు గుమాస్తా పవన్ అంటూ మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.