Home / ANDHRAPRADESH / చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రుల ముంబై హవాలా స్కామ్‌పై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రుల ముంబై హవాలా స్కామ్‌పై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌‌పై ఐటీశాఖ జరిపిన దాడుల్లో వెలుగు చూసిన 2 వేల కోట్ల అవినీతి బాగోతంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం శ్రీనివాస్‌పై ఐటీదాడులకు, చంద్రబాబుకు ఏం సంబంధం అంటూ అడ్డంగా బుకాయిస్తున్నారు..ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీ దాడుల్లో కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్లు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నాయి. అయితే తాజాగా ఈ 2 వేల కోట్ల స్కామ్‌పై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ… 2 వేల కోట్ల స్కామ్‌లో శ్రీనివాస్‌పై ఐటీదాడులకు చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదని, టీడీపీ అనుకుల పత్రికలు ప్రచురిస్తున్నాయని వైవి తీవ్రంగా దుయ్యబట్టారు. మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు దాదాపు మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తే రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు వెలుగు చూశాయన్నారు. అయితే ఈ అక్రమ బాగోతంలో చంద్రబాబు తప్పు లేదన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రుల ముంబై హవాలా స్కామ్‌ గుట్టును వైవి బయటపెట్టారు.  2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత ముంబైలో ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలో తనిఖీలు చేయగా.. అప్పటి ఏపీ మంత్రులు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలకు హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు వెల్లడైందని ఆరోపించారు. ఈ విషయం చంద్రబాబు పీఎస్‌పై, లోకేష్ సన్నిహితులకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలపై 5 రోజులపాటు జరిపిన సోదాలు ముగిసిన తర్వాత ఐటీ శాఖ స్వయంగా ప్రకటించిందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ప్రముఖ సంస్థల్లో ఒకటి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడికి చెందినది కాగా.. మరో రెండు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, లోకేశ్‌ పార్టనర్‌ రాజేశ్‌కు చెందినవని చెప్పారు. తక్షణమే చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తంగా చంద్రబాబు బ్యాచ్ ముంబై హవాలా బాగోతంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat