ఏపీలో ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్ మరో మలుపు తిరిగింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆంధ్రా నుంచి హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీకి తరలి వచ్చిన 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కోశాధికారి అహ్మద్ పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో నేను శ్వాస సంబంధమైన సమస్యలతో ఫరిదాబాద్‌లోని మెట్రో ఆసుపత్రిలో చేరాను. కాబట్టి ఇప్పటికిప్పుడు విచారణకు హాజరు కాలేనంటూ అహ్మద్‌పటేల్ ఐటీశాఖకు తెలిపారు. కాగా ఇటీవల ఐటీశాఖ హైదరాబాద్‌లోని ప్రముఖుల ఇండ్లు, కార్యాలయాలు, ఒక పెద్ద నిర్మాణ సంస్థపై దాడులు చేసినప్పుడు లభించిన పత్రాల్లో ఏపీ నుంచి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు హవాలా మార్గంలో అహ్మద్‌పటేల్ ఖాతాకు చేరిన విషయం బయటపడింది. చంద్రబాబు హయాంలో అమరావతిలో భారీ నిర్మాణ పనులు చేపట్టిన ఒక ఇన్‌ఫ్రా సంస్థ నుంచి దాదాపు 400 కోట్ల రూపాయలు బెంగళూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ ద్వారా ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి చేరాయని కొంత కాలం క్రితం ఐటీ, ఈడీ పత్రికా ముఖంగా వెల్లడించింది.
అయితే ఈ హవాలా వ్యవహారంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంపై దాడి చేసి 2 వేల కోట్ల లావాదేవీలకు సంబంధించి పలు కీలక పత్రాలతో సహా మొత్తం 1000 డాక్యుమెంట్లు, బ్యాంకులాకర్లు, స్వాధీనం చేసుకున్నట్లు..ఐటీ శాఖ ప్రకటించింది.. అలాగే హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేలాది కోట్ల స్కామ్ జరిగిందని ఐటీశాఖ తెలిపింది. ఈ సందర్భంగా 400 కోట్ల హవాలా డబ్బుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు ఐటీశాఖ విచారణకు పిలవడం జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్, సోనియాలతో కలిసి మోదీని దించేస్తా అని తొడ కొట్టిన చంద్రబాబు… ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో థర్డ్ ఫ్రంట్ నుంచి ప్రధాని కావాలని కలలు కన్నాడు… ఆ కలని నిజం చేసుకోవటానికి దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని వేలాది కోట్లు హవాలా ద్వారా తరలించాడు. ఇక ఈ 400 కోట్ల హవాలా స్కామ్‌పై మరో వాదన బయటకు వచ్చింది. ఆ మధ్య సొంతరాష్ట్రం గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. అహ్మద్‌పటేల్‌ను రాజ్యసభలో అడుగుపెట్టనివ్వకూడదని మోడీ, షా గట్టిగా ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంపు నడపడంతో అహ్మద్ పటేల్ విజయం సాధ్యమైంది. అయితే ఆ క్యాంపు ఖర్చులన్నీ కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పెట్టుకున్నారు అనే వార్త అప్పట్లో వచ్చింది. డికే శివకుమార్‌కు ఆంధ్రా నిర్మాణ సంస్థ నుంచి 400 కోట్లు హవాలా ద్వారా తరలించినట్లు మరో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా అమరావతి టు ఢిల్లీ వయా కర్నాటక ద్వారా 400 కోట్ల హవాలా స్కామ్ జరిగిందని తెలుస్తోంది. మరి ఐటీ శాఖ విచారణలో అహ్మద్‌పటేల్ ఉన్నది ఉన్నట్టు వెల్లడించే పక్షంలో చంద్రబాబుతో సహా, పలువురు కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు ఇరుక్కునే అవకాశం ఉన్నట్లు ఢిల్లీలో చర్చ జరుగుతోంది.అయితే ఈ 400 కోట్ల హవాలా స్కామ్‌లో జైలుకు ముందు వెళ్లేది..అహ్మద్‌పటేలా…చంద్రబాబా..అని ఇరుపార్టీల్లో చర్చ జరుగుతోంది.