గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం జగన్ సర్కార్ 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. రా ష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సిట్ సమగ్రంగా విచారణ జరుపుతుంది. అయితే ఇన్ని రోజులు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదని, అసలు ఏ శాఖలో అవినీతి జరుగలేదని, మేము నిప్పు..కావాలంటే మీ ప్రభుత్వమే ఉంది కదా..దమ్ముంటే విచారణ జరిపించుకోండి అంటూ చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు సవాళ్లు విసిరారు. కాని జగన్ సర్కార్ అనూహ్యంగా సిట్ ఏర్పాటు చేయడంతో బాబు బ్యాచ్ వణికిపోయింది. అందుకే ఈ ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద నిన్న వేసిన సిట్ మరో ఉదాహరణ. టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు’ అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.
ఇక టీడీపీ నేతలు సిట్ ఏర్పాటు రాజకీయ కక్ష సాధింపు అంటూ ఎదురుదాడి చేయడం మొదలెట్టారు. అయితే మంత్రి బొత్స సరికొత్త వాదనతో బాబు బ్యాచ్ అడ్డంగా బుక్కైంది. తాజాగా మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ.. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించమని గతంలో చంద్రబాబే, లోకేష్‌లే స్వయంగా కోరారని బాంబు పేల్చారు. ఇన్నాళ్లు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదు..కావాలంటే విచారణ జరిపించుకోండి మేం భయపడేది లేదన్న టీడీపీ… ఇప్పుడు ఎంక్వైరీకి తాము సిద్ధపడి సిట్ వేసిన తర్వాత ఎందుకు ఉలిక్కిపడుతుందని ప్రశ్నించారు. అయినా తప్పు చేయకుంటే టీడీపీ నేతలు నిర్దోషులుగా బయటపడతారు కదా అని బొత్స వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న విషయంపై టీడీపీ పూటకో మాట మాట్లాడుతోందని బొత్స విరుచుకుడ్డారు. తొలుత సీబీఐకి ఈ విచారణ బాధ్యతలు అప్పగిస్తామంటే… రాష్ట్ర పోలీసులను అవమానిస్తారా? అన్నారని, సీఐడీకి అప్పగిస్తామంటే.. రాష్ట్ర పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లు వింటారని మళ్లీ మాట మార్చారని తెలిపారు. టీడీపీ వాదనలను విన్న తర్వాతే తాము సిట్ ను ఏర్పాటు చేశామని బొత్స చెప్పుకొచ్చారు. దీంతో సిట్‌పై అడ్డగోలుగా మాట్లాడిన టీడీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మొత్తంగా సిట్ ఏర్పాటుపై ఎదురుదాడి చేసిన బాబు బ్యాచ్..మంత్రి బొత్స వాదనతో అడ్డంగా దొరికిపోయింది.