Home / ANDHRAPRADESH / విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై టీడీపీ రాజకీయం…మంత్రి కన్నబాబు ఫైర్..!

విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై టీడీపీ రాజకీయం…మంత్రి కన్నబాబు ఫైర్..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. పులివెందుల నుంచి వైసీపీ రౌడీలను దింపి చంద్రబాబుపై దాడి చేయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడ్డారని వైసీపీ నేతలు టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై కాకినాడలో మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చంద్రబాబుకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నామని అన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని వద్దన్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం సముచితమన్నారు. తాను ఈ రాష్ట్రానికి నాయకుడిని కాదని.. అమరావతికి మాత్రమే నాయకుడ్ని అని చంద్రబాబు చాలా రోజులుగా స్పష్టంగా చెబుతున్నారన్నారు. అమరావతి కోసం ఆయనే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని కన్నబాబు విమర్శించారు. చివరకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. అమరావతి ఉద్యమం కోసం తన కుటుంబంతో సహా రోడ్డెక్కారని ధ్వజమెత్తారు.  కేవలం ఒక పక్షం కోసం చంద్రబాబు నిలబడినప్పుడు… ఖచ్చితంగా రెండో పక్షం నిరసన తెలియజేస్తుందని..దానికి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనే నిదర్శనమని కన్నబాబు స్పష్టం చేశారు.

 

ఇక టీడీపీ నేతల విమర్శలపై మంత్రి మండిపడ్డారు. ‘‘అమరావతి పరిరక్షణ ఉద్యమంలో టెంటుల్లోకి వెళ్ళి కూర్చున్న దేవినేని ఉమా ఏ పార్టీ వారు? ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి మీద ప్రేమ లేని మీరు ఏ ముఖం పెట్టుకుని విశాఖపట్నం వచ్చారని వైఎస్సార్‌సీపీ తరపున అడుగుతున్నామంటూ నిలదీశారు. వైఎస్‌ జగన్‌ను విశాఖ రన్‌ వే పై అడ్డుకున్న ఘటనకు బదులు తీర్చుకున్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఆ సంఘటనతో… మీరు నిన్నటి విశాఖ సంఘటనను ఎలా పోల్చుకుంటారని కన్నబాబు ఫైర్ అయ్యారు. ఆ రోజు రన్ వే పోలీసులను పెట్టి ఎయిపోర్టులోకి కూడా రాకుండా వైఎస్‌ జగన్‌ను అడ్డుకున్నారు. ఇవాళ మిమ్మల్ని ఏ పోలీసు అధికారులైనా అడ్డుకున్నారా? అని కన్నబాబు ప్రశ్నించారు. నిరసనకారులు ఆగ్రహంతో ఉన్నారని.. చాలా గంటల తర్వాత మీకు సురక్షితం ఉండదని చెప్పారు తప్పా.. మిమ్మల్ని అడ్డుకోలేదని కన్నబాబు పేర్కొన్నారు. మఫ్టిలో పోలీసులు ఉన్నారన్న టీడీపీ ఆరోపణలను కన్నబాబు తప్పుబట్టారు. ఇంటిలిజెన్స్‌ చీఫ్‌తోనే రాజకీయం నడిపి.. పోలీసులతో దౌర్జన్యం చేయించి ప్రతిపక్షాలపై కేసులు పెట్టించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. తాము పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని.. ఏదీ న్యాయం అయితే అది చేయాలని ప్రభుత్వం చెప్పిందన్నారు. అంతేకాని ఏకపక్షంగా పనిచేయమని పోలీసులకు మీలా చెప్పలేదని మంత్రి కన్నబాబు విమర్శించారు. మొత్తంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల తిరుగుబాటుతో చంద్రబాబు కేవలం అమరావతికే నాయకుడని తేలిపోయిందంటూ మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat