అదేంటీ…జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడే అమిత్‌షా పవన్‌కు ఏం షాక్ ఇచ్చాడనుకుంటున్నారా…అదేనండి.. మార్చి 15 న హైదరాబాద్‌లో సీఏఏకు అనుకూలంగా పవన్ కల్యాణ్‌తో కలిసి, కేంద్రమంత్రి అమిత్‌షా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ను లను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా, పవన్‌ల సభ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హీట్ పెంచింది. పవన్, అమిత్‌షాలు ఆ సభలో ఏం మాట్లాడుతారో..జగన్, కేసీఆర్‌లపై ఎలా విరుచుకుపడతారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లలో ఇప్పటి వరకు 50 మంది వరకూ చనిపోయారు. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్ అట్టుడికిపోయింది. దేశవ్యాప్తంగా కేంద్రం తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో నెట్‌జన్లు మోదీ, షాలను ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏకంగా సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అమిత్‌షాకూడా వివాదాస్పద సీఏఏ తేనెతుట్టెను కదుపవద్దని డిసైడ్ అయ్యారంట..కాగా జనసేన , బీజేపీలో పొత్తు కొనసాగుతున్న ఈ టైమ్‌లో సీఏఏ సభ జరిగితే…కచ్చితంగా పవన్‌కు మైలేజీ వస్తుందని..జనసైనికులు భావించారు.అయితే సీఏఏపై పార్లమెంట్‌లో రచ్చ జరుగుతుండడంతో అమిత్‌షా హైదరాబాద్ సభను రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్‌షా సమాచారం పంపారంట…కాగా హైదరాబాద్‌లో కరోనా కేసులు నమోదు కావడంతో అమిత్‌షా తన సభను రద్దు చేసుకున్నాడని మరోక వాదన వినపడుతోంది. మొత్తంగా సీఏఏ సభ ద్వారా తన ఇమేజ్ పెంచుకోవచ్చు అని భావించిన పవన్‌కు అటు అమిత్‌షా భారీ షాక్ ఇచ్చాడు..దీంతో క్యా కరోనా..అంటూ పవన్ కల్యాణ్ తలపట్టుకున్నాడంట.
