34 సంవత్సరాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని వీడలేని పరిస్ధితుల్లో, భయంకరమైన మోసం చేసేటటువంటి పరిస్థితులను చూసి, ఇంకెంతకాలం మోసపోతామని, ఈ మోసపూరితమైన మాటల నుంచి భయటకు రావాలనే ఉద్ధేశ్యంతోనే కదిరి బాబూరావు బయటకు వచ్చారని తోట త్రిమూర్తులు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే పార్టీని వీడానని స్వయంగా బాబూరావు చెప్పారని, అదీ చంద్రబాబు నైజమన్నారు. మేనిఫెస్టోను ఒక బైబిల్‌లా, ఖురాన్‌లో నమ్మేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజే ఈ మేనిఫెస్టో గురించి చెప్పడం జరిగిందన్నారు, ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎనిమిది, తొమ్మిది నెలల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను పూర్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రమంతా ఇవాళ కులాలు, పార్టీలు, వర్గాలు కాకుండా రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటాడనే వ్యక్తి దగ్గరే పనిచేయాలనుకుంటారే తప్ప అవసరాలకోసమే మాటలు మార్చే ఊసరవల్లిల దగ్గర పనిచేయకూడదనే ఉద్దేశ్యంతోనే బాబూరావు ఈనిర్ణయం తీసుకున్నారు. ఈ రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ అన్ని స్ధానాలను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెప్తున్నారన్నారు.
