Home / ANDHRAPRADESH / బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా శ్వేత.. ఎవరీ శ్వేత ?

బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా శ్వేత.. ఎవరీ శ్వేత ?

విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిని ఆపార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. టీడీపీ తరపున మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతను రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె ఈ కేశినేని శ్వేతా. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈమె కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేసారు. అలాగే గతంలో జరిగిన యూఎస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పాత లీడర్లపై దారుణమైన ఆరోపణలు విమర్శలు ఉన్న నేపధ్యంలో కొత్తవారిని రంగంలోకి దింపుతున్న తెలుగుదేశం ఆశలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.