ఏమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ రాష్ట్రాన్ని మరో బీహార్‌లా మార్చేస్తున్నారని విమర్శించాడో కాని..మరుసటి రోజే జనసైనికులు బీహారీ గ్యాంగ్‌లా రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ..టీడీపీ, జనసేన పార్టీలు పథకం ప్రకారం హింసాకాండ రగిలిస్తున్నాయి. కావాలనే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం..తర్వాత వైసీపీ నేతల దాడులు, అరాచకం అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మీడియా మందుకు వచ్చి ప్రభుత్వంపై బురద జల్లడం పనిగా పెట్టుకున్నారు.
పవన్ బీజేపీతో పొత్తుపెట్టుకున్నా ఇప్పటికీ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కనీసం అభ్యర్థులను నిలబెట్టలేని స్థితిలో పవన్ ఉన్నాడు. అయితే కొద్దోగొప్పో బలం ఉన్న గోదావరి జిల్లాల్లో పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ, జనసేన పార్టీలు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో సీట్లు చెరి సగం పంచుకుని మరీ పోటీ చేస్తున్నాయి. అయినా నిస్సిగ్గుగా పవన్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ రాష్ట్రంలో నామినేషన్లు వేయలేని విధంగా వైసీపీ బెదిరింపులకు పాల్పడుతున్నారని, వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారంటూ ఆరోపించాడు. ఏపీ అంటేనే హింస అని పరిస్థితి తీసుకొస్తున్నారని.. రాష్ట్రాన్ని మరో బీహార్‌లా మార్చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశాడు.. కాగా వాస్తవ పరిస్థితి మాత్రం వేరే ఉంది. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పథకం ప్రకారం స్థానికంగా వైసీపీ నేతలను రెచ్చగొట్టి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు బరితెగించారు. ఓ దళిత వైఎస్సార్ సీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేశారు. తొట్టంబేడు మండలం చిప్పలకు చెందిన బత్తయ్య అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై జనసేన కార్యకర్తలు కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో బత్తయ్యకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగుల్లో పడి ఉన్న బత్తయ్యను స్థానిక వైసీపీ నాయకులు ఆసుపత్రికి తరలించారు. మార్చి 12 వ తేదీ సాయంత్రం బత్తయ్యను చంపుతామని హెచ్చరించిన జనసేన కార్యకర్తలు 13 తేదీ ఉదయాన్నే పథకం ప్రకారం బత్తయ్యపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వైసీపీ కార్యకర్త బత్తయ్యపై హత్యాప్రయత్నం నేపథ్యంలో శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. అయ్యా పవనూ..చంద్రబాబు తొత్తుగా మారి వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు..రాష్ట్రాన్ని మరో బీహార్‌లా మార్చేస్తున్నారు..అంటూ..మైకు పట్టుకుని ఊగిపోయావు..మరీ బిహారీ గ్యాంగ్‌లు మీ పార్టీలోనే ఉన్నారు..దాడులు మీవాళ్లే చేస్తున్నారు..కాస్త చూసి మాట్లాడడండి పవనూ..అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.