Home / ANDHRAPRADESH / ఈసీ ఎవరంటూ ఎలక్షన్ కమీషనర్ ద్వివేదిని వేలు చూపించి బెదిరించలేదా చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!

ఈసీ ఎవరంటూ ఎలక్షన్ కమీషనర్ ద్వివేదిని వేలు చూపించి బెదిరించలేదా చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్‌ వంటి అధికార యంత్రాంగంతో  సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..ఎన్నికల కమీషనర్‌పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఏంటని సుద్దులు చెబుతున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్  కమీషనర్‌ను కూడా మీరు బెదిరిస్తారా అంటూ వైసీపీ నేతలను చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడు. అన్నీ జగన్‌కు చెప్పి చేయాలా అంటూ అసహనం వ్యక్తం చేశాడు.. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుందని చంద్రబాబు చెప్పుకొచ్చాడు.

 

అయితే ఎన్నికల కమీషనర్‌నే ప్రశ్నిస్తారా అంటూ గొంతు చించుకుంటున్న చంద్రబాబు గతంలో ఎన్నికల కమీషనర్‌గా పని చేసిన గోపాలకృష్ణ ద్వివేదిని వేలు పెట్టి బెదిరించిన సంగతిని మర్చిపోయాడు..ఇప్పుడు మాత్రం తనకు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరినే ప్రశ్నిస్తారా అంటూ గొంతు చించుకుంటున్నాడు. ఒకసారి 2019 సార్వత్రిక ఎన్నికల టైమ్‌లో ఏం జరిగిందో చూడండి…2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పలువురు పోలీస్ అధికారులు పని చేస్తున్నారని నాటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదే‎శాలతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఎస్పీలు, ఇంటెలిజెన్స్‌ డీజీ, సీఎస్‌‌లను నాటి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ద్వివేది బదిలీ చేశారు. దీంతో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వెంటనే ఎన్నికల కమీషనర్ కార్యాలయానికి వెళ్లి  ద్వివేది మీద అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు.

 

హూ ఈజ్‌ ద ఎలక్షన్ కమీషన్ అంటూ ద్వివేదిని వేలుపెట్టి బెదిరించారు. ‘ఈజ్‌ వెరిఫయింగ్ ది ఫ్యాక్ట్స్‌ అండి‌.. ఐ యామ్‌ ఆస్కింగ్‌.. యు హావ్‌ టు వెరిఫై.. అదర్‌వైజ్ వుయ్‌ విల్‌ వెరిఫై‌. లెట్‌ దెమ్‌ వెరిఫై.. దెన్‌ ఐ విల్‌ ఫైట్‌ ఇన్‌ ఢిల్లీ.. దెన్‌ ఎందుకు మీ ఆఫీస్‌ ఎందుకు ఇంకా.. క్లోజ్‌ చేయండి.. హు ఈజ్‌ ద ఎలక్షన్‌ కమిషన్‌.. నేను అడుగుతున్నా.. సరిగా కండక్ట్‌ చేయలేకపోతే.. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్‌ చేసుకోండి మీరు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్లు. మేమంతా ఇంట్లో పడుకుంటాం.. ఎందుకు నేను కష్టపడాలి.. ఎందుకు ఈ మీటింగ్‌లు మాకు.. ఏం అవసరం లేదు..మేం అడిగేదేంటి.. మీరు ఇండిపెండెంట్‌ అథార్టీ అవునా? కాదా? ఢిల్లీ చెప్పినట్టు మీరు యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఎందుకు ఫాలో కావాలి. ఐ యామ్‌ ఆస్కింగ్‌.. యు ఆర్‌ నాట్‌ ఏ పోస్ట్‌ ఆఫీస్‌.. యు ఆర్‌ హావింగ్‌ పవర్‌.. ఏమైనా ఉంటే అబాలిష్‌ చేసేయమనండి… మిమ్మల్ని అందర్నీ తీసేయమనండి.. ఆయన్నే (మోదీని) ఓ క్లర్క్‌ను పెట్టుకోమని చేయమనండి మేం చూస్తాం.. రేపు ఎలక్షన్‌ కమిషన్‌ ఏంటో.. ఇవన్నీ నేను చెబుతున్నా..అంత ఈజీగా వదిలిపెట్టను నేను టేకప్‌ చేశానంటే లాజికల్‌గా పోవాల్సిందే అంటూ వేలు పెట్టి బెదిరించాడు. ఇప్పడు అవన్నీ మర్చిపోయి ఎలక్షన్ కమీషనర్‌ కూడా బెదిరిస్తారా అంటూ చంద్రబాబు సుద్దులు చెబుతున్నాడు. తనకు అనుకూలంగా ఉంటే ఒకలా…తనకు వ్యతిరేకంగా ఉంటే మరొలా మాట్లాడడం బాబుకు అలవాటే…నిజంగా ఊసరవెల్లి కూడా బాబును చూసి సిగ్గుపడుతుంది.