నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి ఏపీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఎన్నికల కమీషనర్‌గా నిలిచిపోతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా నిమ్మగడ్డ చుట్టూ తిరుగుతూంది. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదావేయడంతో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు వివాదం మొదలైంది. అయితే ప్రభుత్వంతోకాని, అధికార యంత్రాంగంతో కానీ సంప్రదించకుండా ఎలా వాయిదా వేస్తారంటూ అధికార పార్టీ ఈసీ నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించింది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక సుప్రీంకోర్డ్ కూడా ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ ఈసీ నిమ్మగడ్డ తీరును తప్పుపట్టింది. అయితే చంద్రబాబుకు, నిమ్మగడ్డ కుమ్మక్కు అయ్యారంటూ వైసీపీ చేసిన ఆరోపణలకు బలంగా ప్రభుత్వంపై ఘోరమైన ఆరోపణలతో కూడిన ఓ లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అయింది. దీంతో ఆ లేఖపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగింది.
సీఎం జగన్‌ను , ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలయ్యేలా ఉన్న ఆ లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అవుతున్నా ఈసీ నిమ్మగడ్డ స్పందించకపోవడంతో ఆ లేఖను చంద్రబాబే రాయించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఈసీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ ఆ లేఖ తాను రాయలేదని వివరణ ఇచ్చినా…అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిమ్మగడ్డ, చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నట్లుగా సంకేతాలు ప్రజల్లోకి పోయాయి. అంతే కాదు వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ప్రతిగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలంతా ప్రెస్‌మీట్లు పెట్టి ఈసీ నిమ్మగడ్డను వెనకేసుకువచ్చారు. దీంతో లేఖ బాగోతంలో కూడా నిమ్మగడ్డ, టీడీతో కుమ్మక్కు అయ్యాడని అర్థమవుతోంది. అలాగే ఈసీ ప్రకటించకముందే టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఎన్నికలు వాయిదాపడుతున్నట్లు మీడియా ముందు చెప్పారంటే..ఎల్లో బ్యాచ్‌తో నిమ్మగడ్డకు ఉన్న బంధం ఏంటో అర్థమవుతుంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా సంబురాలు చేసుకుంటున్నారు. . ఏకంగా నిమ్మగడ్డ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.దీన్ని బట్టి ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని తమజాతిరత్నంగా చంద్రబాబు సామాజికవర్గీయులు భావిస్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పూర్తిగా చచ్చిపోనున్న టీడీపీకి ఎన్నికలు వాయిదా వేసి ఊపిరిపోశాడన్న ఆనందంతో.. నిమ్మగడ్డను దేవుడిలా కొలుస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇది చాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యాడని చెప్పడానికి..వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న చంద్రబాబుకు నిమ్మగడ్డ లాంటి సొంత సామాజికవర్గీయులు ఎప్పుడూ కొమ్ము కాస్తూనే ఉంటారన్నది మరోసారి రుజువైంది.