Home / ANDHRAPRADESH / పారాసెట్‌మాల్‌పై ఎల్లోబ్యాచ్‌కు అదిరిపోయే పంచ్ వేసిన మంత్రి పేర్నినాని…!

పారాసెట్‌మాల్‌పై ఎల్లోబ్యాచ్‌కు అదిరిపోయే పంచ్ వేసిన మంత్రి పేర్నినాని…!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనాపై ప్రజల్లో భయాందోళన తగ్గించడానికి సీఎం జగన్ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, కరోనాతో జ్వరం వస్తుంది కాబట్టి పారాసెట్‌మాల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనాకు పారాసెట్‌మాల్ వాడితే సరిపోతుంది..పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అసెంబ్లీ వేదికగా చెప్పారు.. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు, లోకేష్ ఆధ్వర్యంలోని పెయిడ్ టీమ్ సోషల్ మీడియాలో సీఎం జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు , మీమ్స్‌తో దుష్ప్రచారం చేశారు.

 

అయితే నిజానికి కరోనా వైరస్‌కు నివారణకు ఇంత వరకూ వ్యాక్సిన్ లేదు. కరోనా సోకిన వాళ్లందరూ చనిపోరు..కరోనా మరణాల్లో 99 శాతం వృద్ధులు, బీసీ, షుగర్, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో  బాధపడేవారు.. ఇమ్యునిటీ పవర్ లేని వాళ్లు మాత్రమే చనిపోతున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివాళ్లు ఇమ్యునిటీ పవర్ ఉన్నవారు మాత్రం వైద్యుల చికిత్సతో కోలుకుంటున్నారు. డాక్టర్లు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు పారాసెట్‌మాల్‌ టాబ్లెట్స్‌తో పాటు, యాంటీ బయాటిక్స్‌తోపాటు, రోగుల ఆనారోగ్య సమస్యలను బట్టి మందులు ఇస్తూ ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. అవసరమైతే హెచ్‌ఐవీకి వాడే మందులు కూడా వాడి ఇమ్యునిటీ పవర్‌ను పెంచడం ద్వారా రోగి మరణించకుండా కాపాడుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ సోకిన వాళ్లందరికీ డాక్టర్లు పారాసెట్‌‌మాల్ టాబ్లెట్లు కచ్చితంగా వాడాల్సిందే. కరోనాతో జ్వరం వస్తే పారాసెట్‌మాల్ కాకుండా ఏ మందు వాడరు..వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పారాసెట్‌మాల్ టాబ్లెట్స్ వాడవచ్చు అని ప్రకటించింది. ఇది తెలిసి కూడా ఎల్లో బ్యాచ్ పారాసెట్‌మాల్‌పై సీఎం జగన్‌పై నీచమైన కామెంట్లతో కించపరుస్తున్నారు.

 

తాజాగా ఓ లీడింగ్ టీవీ ఛానల్‌ టీవీ9 లో పారాసెట్‌మాల్‌పై టీడీపీ చేస్తున్న రాద్ధాంతంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ షరామామూలుగా పారాసెట్‌మాల్‌ పేరుతో సీఎం జగన్‌పై విమర్శలు వేశారు. దీంతో అదే చర్చలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. సరే..టీడీపీ వాళ్లు అన్నట్లు పారాసెట్‌మాల్ కరెక్ట్ కాదు..పోనీ కరోనాకు, కాల్వ శ్రీనివాస్, చంద్రబాబునాయుడు ఏమైనా నారాసెట్‌మాల్ కనుక్కున్నారా చెప్పండి అంటూ సెటైర్ వేశారు. ఓకే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన పారాసెట్‌మాల్ తప్పు..మరి మీ దగ్గర ఏ మందు ఉందో చెప్పండి పోనీ..మీరు కనుక్కున మందు ఏంటీ..అని కాల్వ శ్రీనివాస్‌ను నిలదీశారు. పారాసెట్‌మాల్‌ను బ్యాన్ చేశామని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది అని మంత్రి వివరణ ఇచ్చారు. అంతే కాదు మీరు ఏ డాక్టర్‌ను అయినా అడగండి..ఇవాళ హెచ్‌ఐవీకి వాడే మందులతో పాటు..పారాసెట్‌మాల్ వాడుతున్నామంటూ డాక్టర్లు చెబుతున్నారంటూ మంత్రి చెప్పిన వ్యాఖ్యలకు టీవీ వ్యాఖ్యాత రజనీకాంత్ కూడా అవునవును..అంటూ అంగీకరించారు. నెల్లూరులో, హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తులకు కూడా పారాసెట్‌మాల్ వాడారంటూ మంత్రి వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు కరోనాకు వాడిన మందు పారాసెట్‌మాలే..కాదు నారా సెట్ మాల్ వాడతామంటే అది మీ ఖర్మ అంటూ మంత్రి టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. మొత్తంగా కరోనాకు చంద్రబాబు కొత్త మందు కనిపెట్టాడు అది నారాసెట్‌మాల్ అంటూ మంత్రి వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat