Home / ANDHRAPRADESH / కేసీఆర్ గారు మనవాళ్లకు కొండంత అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు..జగన్ ! 

కేసీఆర్ గారు మనవాళ్లకు కొండంత అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు..జగన్ ! 

ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.తెలంగాణ నుండి పర్మిషన్ రావడంతో చాలా మంది ఏపీ బోర్డర్ వరకు వచ్చినా లోనికి రానివ్వని పరిస్థితి ఎదురైందని అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆర్యోగం కోసం చేశామని అన్నారు. ఎక్కడివాళ్ళు అక్కడికి వెంటనే వెళ్లాలని ఈమేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడగా ఆయన మనవాళ్లకు కొండంత అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు జగన్ చెప్పారు.