తిరుమలలో అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దు.. రమణ దీక్షితులు
shyam
March 27, 2020
ANDHRAPRADESH
1,001 Views
- కరోనా నేపథ్యంలో తిరుమల లో అఖండ దీపం ఆరిపోయింది అని దుష్ప్రచారం జరుగుతుంది. అయితే టీటీడీ మాత్రం భక్తుల దర్శనాలు ఆపివేసినా స్వామివారి పూజా కైంకర్యాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది. కాగా అఖండ దీపంపై వస్తున్న ఆరోపణల పై టీటీడీ ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో అఖండ దీపంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని రమణ దీక్షితులు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని తెలిపారు. స్వామివారి కైంకర్యాలు నిత్యం ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Post Views: 387