ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వార్త ఏమిటయ్యా అంటే.. అందరి నోట వచ్చే మాట.. కాంగ్రెస్‌తో నారా చంద్రబాబు దోస్తీ. అవును, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారనే సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా దావానంలా వ్యాపించింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.
ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పట్నుంచి చంద్రబాబుపై బీజేపీ నాయకులు చులకనభావం ప్రదర్శిస్తున్నారంట. మావల్లే మీరు ఏపీలో అధికారంలోకి వచ్చారు అంటూ మీడియా సాక్షిగా కామెంట్లు చేయడం టీడీపీ నేతలకు అస్సలు మింగులు పడటం లేదంట. అందులోనూ 2019 ఎన్నికల్లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును సైతం పక్కన పెట్టేందుకు బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. అందులోనూ టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులకు బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేసిందన్న వార్తలు అప్పట్లో షికారు చేశాయి. అయితే, ఇప్పుడు ఆ ప్రస్థావననే బీజేపీ ఎత్తకపోవడాన్ని చంద్రబాబు తప్పుబడుతున్నారు. బీజేపీ ఇచ్చిన మాటను తప్పడంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని, ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు చంద్రబాబు దగ్గరవుతున్నారని ఏపీ కేబినెట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.