Home / ANDHRAPRADESH / మోదీజీ భ‌క్తుడి మీడియా వ‌న్ సైడ్‌ స‌ర్వేలో.. తెల్ల‌మొహం వేసిన చంద్ర‌బాబు..!

మోదీజీ భ‌క్తుడి మీడియా వ‌న్ సైడ్‌ స‌ర్వేలో.. తెల్ల‌మొహం వేసిన చంద్ర‌బాబు..!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలుడిగా, ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ప్రియ‌మైన భ‌క్తుడిగా అర్న‌బ్ గోస్వామి త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్నారు. ఇక ఆయ‌న టైమ్స్ నౌలో వ‌ర్క్ చేస్తున్న రోజుల్లోనే మోదీతో చేసిన ఇంట్ర‌ర్వ్యూలో త‌న‌కున్న న్యూట్ర‌ల్ ఇమేజ్‌ని పోగొట్టుకొని మోదీ గ్యాంగ్‌లో త‌నుకూడా ఒక‌డ‌ని సంఖేతాలు పంపించారు. ఇక ఆ తర్వాత జ‌రిగిన ప‌రిణామాలు.. అర్న‌బ్ టైమ్స్‌ను వదిలిరావడం.. సొంతంగా రిప‌బ్లిక్‌ చానల్ పెట్టుకోవడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా ఆర్న‌బ్ గోస్వామి తన రిప‌బ్లిక్ చానల్ ఉనికి దేశ‌మంత‌టా చాట‌డానికి.. దేశ వ్యాప్త సర్వే నిర్వ‌హించి ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కాడు. ఇక ఆ స‌ర్వే రిజ‌ల్ట్‌లో బీజేపీనే చాంఫియన్‌గా నిలిపాడు ఆర్న‌బ్. దేశ వ్యాపంగా ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. బీజేపీ కూటమి గరిష్టంగా 335సీట్లు సాధిస్తోంద‌ని.. కాంగ్రెస్ పార్టీ కూటమి 89సీట్లు వ‌స్తాయ‌ని రిప‌బ్లిక్ మీడియా నిర్వ‌హించిన స‌ర్వేలో తెలిపింది. అయితే తాజాగా హాల్ చ‌ల్ చేస్తున‌న స‌ర్వే అంత నమ్మశక్యంగా లేదని.. బీజేపీ కూటిమి అన్ని సీట్లు సాధించే ఛాన్సే లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

అందుకు త‌గిన కార‌ణాలతో స‌హా వివ‌రిస్తున్నారు నిపుణులు. ముందుగా మ‌హారాష్ట్ర విష‌యానికి వ‌స్తే కాంగ్రెస్ అక్క‌డ రెండు సీట్లే సాధింస్తుంద‌ని ఆ స‌ర్వే చెప్పింది. 10 ఏళ్ళ త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో అసెంబ్లే ఎన్నిక‌ల్లో సింగిల్‌గా పోటీ చేసినా 40కి పైగా సీట్లు సాధించింది. అలాంటిది వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్ప‌డం.. క‌ర్నాట‌క‌లో కూడా కాంగ్రెస్‌కు 5 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్ప‌డం అంత న‌మ‌శ‌ఖ్యంగా లేద‌ని.. ఎందుకంటే ఐదేళ్ళ క్రితం బీజేపీకి ఉన్న హ‌వా వేరు.. ప్ర‌స్తుతం బీజేపీ పాల‌నం అనంత‌రం కూడా కాంగ్రెస్‌కి అలాంటి రిజ‌ల్ట్ వ‌స్తోంద‌ని చెప్ప‌డంతో అంత‌గా న‌మ్మే ప‌రిస్థితి లేదు.

ఇక ప‌శ్చిమ బెంగాల్ విష‌యానికి వ‌స్తే అక్క‌డ కూడా బీజేపీ 12 సీట్టు గెలుస్తోంద‌ని ఆ స‌ర్వే చెప్ప‌డం.. అతి పెద్ద జోక్ అని బీజేపీ క‌ల‌ల ప్ర‌పంచం నుండి ఈ స‌ర్వే రిజ‌ల్ట్ వెలువ‌డింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక ఈ స‌ర్వే మొత్తంలో మెయిన్ హైలెట్ జోక్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల‌లో ఒక‌టైన తెలంగాణ‌లో బీజేపీకి 3 సీట్లలో గెలుస్తోంద‌ని చెప్ప‌డం.. ఎందుకంటే మోదీ గారి హ‌వా బంప‌ర్ రేంజ్‌లో ఉన్న‌ప్పుడే బీజేపీ గెలిచింది ఒక సీటు మాత్రమే.. అలాంటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ తెలంగాణ‌లో నిల‌బ‌డ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని విశ్లేష‌కులు సైతం తేల్చేశారు.బీజేపీకి మాత్రం 3 సీట్లు వ‌స్తాయ‌ని ఆ స‌ర్వే తేల్చ‌డం చూస్తుంటేనే అర్ధ‌మ‌వుతోంది.. బీజేపీ కూటామికి అనుకూలంగానే ఈ స‌ర్వే జ‌రిగింద‌ని.

అయితే ఇక్క‌డ ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. బీజేపీ కూటమి మళ్లీ భారీ మెజారిటీ సాధించడంతో పాటు మోదీ ప్రధాని అవుతున్నాడని చెబుతున్న ఈ సర్వేలో మాత్రం.. బీజేపీ కూట‌మి అయిన టీడీపీ మాత్రం తెల్ల మొహం వేసింది. ఏపీలో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కంటే ప్ర‌తిప‌క్షం అయిన వైసీపీ హ‌వానే వీస్తోంద‌ని తేల్చేసింది ఆ స‌ర్వే. మరి ఎన్డీయే అనుకూల సర్వేలో.. బీజేపీ మిత్రపక్షాలకు కూడా అనుకూల ఫలితాలు చూపించిన సర్వేలోనే టీడీపీ పార్టీ పరిస్థితి ఇంత ధారుణంగా ఉంద‌ని తేలిందంటే.. రేపు ఫైన‌ల్ రిజ‌ల్ట్ వ‌స్తే టీడీపీ ప‌రిస్థితి ఏంట‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ వ్య‌తిరేక‌త ఏపీలోనే కాదు.. కేంద్రంలో కూడా టీడీపీ పై వ్య‌తిరేకంగా ఉంద‌ని తాజా స‌ర్వే రిపోర్ట్ ఎన్నో విష‌యాల‌ను తేల్చేసింద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat