బీజేపీ సీనియర్ నాయకులు, ఏపీ కో – ఆర్డినేటర్ పురిఘల్ల రఘురామ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురిఘల్ల రఘురామ్ మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ను సినీ నటుడుగా కాకుండా.. ఒక ముఖ్యమంత్రిగా.. సుభిక్ష పాలన అందించి మేలు చేసిన వ్యక్తిగా ప్రజలు గుండెల్లోపెట్టుకున్నారని, అలాగే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కూడా ప్రజలు వారి వారి ఇళ్లల్లో దేవుడి ఫోటోపక్కన.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫోటో పెట్టారని, ఎన్టీఆర్ తరువాత అంతటి గొప్పటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు. అంలాంటి దమ్మున్న నాయకుడు లేడు కాబట్టే నాడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు.
see also : ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!
see also : జగన్..! జైలు, చిప్పకూడు మరిచావా..?? :మంత్రి జవహర్
నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాడు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. అలాగే నేడు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కూడా రేపు సక్సెస్ కావొచ్చేమో అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు భయపడేది ప్రత్యేక హోదా గురించి కాదని, కేంద్ర మంత్రులు వైసీపీని, టీడీపీని సమానంగా చూస్తుండటంతోనే చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తుందన్నారు.
ప్రత్యేక హోదా అంశంలో ఏదైదో ఉందో.. అదే అంశాలను ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామంటే ఒప్పుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ భయంతో ప్రత్యేక హోదా అంశమంటూ హడావుడి చేస్తున్నారన్నారు. నాడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన దానిలో ఎలాంటి లుకలుకలు లేవని, రాజ్యసభ సభ్యుడు హోదాలోనే విజయసాయిరెడ్డి ప్రధానిని కలిసినట్లు రఘురామ్ చెప్పారు. వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అంశంపై తన పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తా చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ చంద్రబాబు ప్రత్యేక హోదా క్రెడిట్ జగన్‌కు పోతుందన్న భయంతో.. సీఎం చంద్రబాబు హడావుడిగా మీడియా సమావేశంపెట్టి ప్రత్యేక హోదా అంశంపై తాము కూడా రాజీనామాలు చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు పరిఘల్ల రఘురామ్.