పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్క..!! అవును, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్కట. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో ములాఖత్ అయి ఏపీ ప్రజలను నట్టేట ముంచారట. అంతటితో ఆగక టీడీజీ, బీజేపీ మేనిఫెస్టో పోస్టుల్లో పవన్ కల్యాణ్ తన ఫోటో వేయించుకునేందుకు ఎంతో తాపత్రయ పడ్డారట. నా మద్దతు టీడీపీ, బీజీపీకి ఎల్లవేళలా ఉంటుందని కుండబద్దలు కొట్టాడు పవన్ కల్యాణ్. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న పవన్ కల్యాణ్ ఏపీలో ఒక మహిళ, తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు. ఏపీలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూసి అప్పులు కట్టలేక 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ సామాన్య వ్యక్తి.
see also : జగన్‌పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!
see also : 2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
సర్దార్ గబ్బర్‌సింగ్, అజ్ఞాతవాసి, కాటమరాయుడు చిత్రాలతో నష్టపోయిన డిస్ర్టిబ్యూటర్లకు ఎంతమొత్తం చెల్లించావో చెప్పు.. ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు తీసుకునే నీవు నష్టపోయిన డిస్ర్టిబ్యూటర్లను ఆదుకోవాల్సిన బాధ్యత నీపై లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ సామాన్య వ్యక్తి. చంద్రబాబు అవినీతి, ఇసుక దోపిడీ, సెక్స్‌రాకెట్, కాల్ మనీ వంటి ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏపీలో జరుగుతుంటే ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. ఏంటేంటి… మీ అన్నను మోసం చేశారా..? మీ అన్న మోసం చేశాడా.. వాళ్లు మీ అన్నను మోసం చేశారా..? ఒక్కసారి నీ అంతర్మథనాన్ని ప్రశ్నించుకో అంటూ హితవు పలికాడు ఆ సామాన్య కార్యకర్త.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఆ వ్యక్తి వీడియో చూసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వారంతా అతనిపై తీవ్ర స్థాయిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.