అవును, ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటికీ బతికి ఉందంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే.. జగన్‌కు నా హ్యాట్సాఫ్. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జగన్‌లో చూస్తున్నా..!! ప్రజలను మోసం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వేలెత్తి చూపడంలో, అధికార పార్టీ టీడీపీ చేయలేని విధంగా మాట తప్పని, మడమ తిప్పని పోరాటం చేస్తున్నజగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు అన్నారు.
see also :
వంగవీటి రాధా షాకింగ్ డెసీషన్.!!
కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ… చంద్రబాబు సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను వంచించడంలో చంద్రబాబుకు సాటి ఎవ్వరూ రారని, చంద్రబాబు ఆలోచనలన్నీ రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేయాలనే తప్పా.. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఏ నాడూ ఆలోచన చేయలేదన్నారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యతను తీసుకుంటానన్న చంద్రబాబు, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ప్రత్యేక హోదాపై ఒక్కో రోజు.. ఒక్కో మాటతో ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబును ప్రయత్నించారన్నారు. ఈ విషయాలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వ అవినీతిని ఏకిపారేశారు చలసాని శ్రీనివాసరావు.
see also :
మరో భారీ కుంభకోణం వెలుగులోకి..!!
ప్రత్యేక హోదా విషయంపై రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటికీ ఒకే మాటపై నిలబడ్డ నాయకుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే తన దృష్టిలో ఓ పోరాట యోధుడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కారం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా పెట్టిన కేసుల్లో వైఎస్ జగన్ నేరస్థుడు కాదని, వైఎస్ జగన్‌పై కేంద్ర, రాష్ట్రంలో ఉన్న కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్నారు స్పష్టం చేశారు.ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో ఉద్యమాలు చేయిస్తూనే.. మరో పక్క పార్లమెంట్ వేదికగా తమ పార్టీ ఎంపీలతో జగన్ చేయిస్తున్న పోరాటం అద్భుతమని వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు చలసాని శ్రీనివాస్‌రావు.