ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు, కార్యకర్తలకు లక్షల కోట్లనిధులను సంతర్పణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం కష్టమేనని సర్వే సంస్థలు తేల్చేయడంతో, రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు, తన రాజకీయ చాణుక్యతతో ఏపీ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి తెర తీశారు. అందుకు చంద్రబాబు నాయుడు మూడు ప్రధాన మార్గాలను ఎంచుకోవడం గమనార్హం. అందులో మొదటిది ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడంతోపాటు.. కాంట్రాక్టుల నుంచి ముడుపులు తీసుకోవడం.! రెండోది రెవెన్యూ డిపార్ట్‌మెంట్లలోని ఖజానాను కొల్లగొట్టడం..! ఇక పోతే మూడోది.. నిరుద్యోగుల పేరుతో ఒక్కో వ్యక్తిపై రూ.10 లక్షల నగదును టీడీపీ నేతలకు, నాయకులకు, కార్యకర్తలకు దోచి పెట్టడం. ఇలా చంద్రబాబు 2019 ఎన్నికల్లోపు రాష్ట్ర ఖజానాను తన పార్టీ శ్రేణులకు దోచి పెట్టేందుకు సిద్ధమయ్యారు.
అయితే, పైన చెప్పిన ఆ మూడు విషయాలపై విశ్లేషణాత్మక వివరణ మీ కోసం..!!
1. ప్రాజెక్టుల వ్యయం పెంచడం..!!
సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామంటూ వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ఇటీవల కాలంలో పలు పత్రికలతో పాటు, సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్నే ఏపీ కేబినేట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం స్పష్టం చేసింది. ఏపీ కేబినెట్ మంత్రులు ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచుతూ జీవో విడుదలకు ఆమోద ముద్ర వేశారు. అయితే, మంత్రులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కో ప్రాజెక్టు వ్యయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు పెరగనుంది. ఇంకో విషయమేమిటంటే.. మంత్రులు తీసుకున్న ఈ నిర్ణయం ఈ సంవత్సరంలోనే అమలు కానుంది.
ఇక్కడ ప్రతీ ఒక్కరు గమనించాల్సిన విషయం ఏమిటంటే..? ప్రస్తుతం ఏపీలో సిమెంటు, స్టీలు రేట్లు పెరగలేదు. ఇక ఇసుక విషయానికొస్తే.. అసలు రేటే లేదు.. ఇసుకను ప్రతీ ఒక్కరికి ఫ్రీ అంటూ చంద్రబాబు సర్కార్ ఎప్పుడో చెప్పేశారు. అలాగే, కంకర రేటు కూడా పెరగలేదు. ఇలా భవన నిర్మాణానికి కావాల్సిన ఏ వస్తువు రేటు పెరగకపోయినా.. చంద్రబాబు మాత్రం ప్రాజెక్టుల వ్యవయాన్ని పెంచడం వెనుక ఉన్న ఆంతర్యంపై ఆలోచించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట..!!
see also : గన్ననరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేనికి భారీ షాక్..!!
ఏపీలోని ప్రాజెక్టు పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంటుందన్న కథనాలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి తీసుకున్న నవయుగ కంపెనీనే ఉదాహరణ. అయితే, 60-సీ నిబంధన ప్రకారం పోలవరం ప్రాజెక్టును నిర్మించేందుకు నవయుగ కంపెనీ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మేము ఎలాంటి లాభాపేక్ష లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. ప్రజా ప్రయోజనాల కోసమే పోలవరం ప్రాజెక్టును లాభాపేక్ష లేకుండా నిర్మించేందుకు ముందుకు వచ్చాం.. అంటూ మీడియా ముందు చిలక పలుకులు పలికింది నవయుగ కంపెనీ. నవయుగ కంపెనీ అలా మీడియా ముందు చెప్పడానికి వెనుక.. చంద్రబాబు ఉన్నారన్నది జగమెరిగిన సత్యం.
see also : ఫలించిన ప్రభుత్వ ఒత్తిడి..హైదరాబాద్‌కు విమానంలో నోట్లు
అందరూ అనుకున్న విధంగానే ఎటువంటి లాభాపేక్ష లేకుండా వచ్చామని చెప్పిన నవయుగ కంపెనీకి.. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద, అలాగే వివిధ రూపాల్లో దాదాపు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధపడ్డారు. మరోపక్కనేమో.. నవయుగ కంపెనీకి నేను నిధులు కేటాయించానా..? అంటూ నాడు మీడియానే ప్రశ్నించిన చంద్రబాబు.. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడి అని సెంటిమెంట్ డైలాగ్ చెప్తూ.. నవయుగ కంపెనీకి వేలకోట్ల రూపాయలను చంద్రబాబు కట్టబెట్టుతున్నారు. అందులో చంద్రబాబు వాటా ఎంతన్న విషయం.. టీడీపీ శ్రేణులకే ఎరుక.
2. ప్రభుత్వ కార్యాలయాల ఖజానాకు చంద్రబాబు భారీ గండి..!!
అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు పూనుకున్నారు. అయితే, ప్రపంచంలోని ఏ ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయానికైనా సాధారణ ఖర్చుల నిమిత్తం ఒక అకౌంట్‌ను మెయింటెన్ చేస్తారన్న విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిన విషయమే. ఒక కంపెనీకి సంబంధించిన యజమాని.. సాధారణ ఖర్చుల నిమిత్తం ఆ అకౌంట్‌కు సంవత్సరం వారీగా నిధులు కేటాయిస్తారు. అలాగే, ఏపీలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయానికి సాధారణ ఖర్చుల నిమిత్తం ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్‌కు ఏపీ ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుంది. పేపర్, వాటర్, ఎలక్ర్టిసిటీ ఇలా చాలా చిన్న చిన్న బిల్లులను ఈ అకౌంట్ లోని నగదును చెల్లిస్తారు.
see also : వారిపై పరువు నష్టం దావా వేస్తా..మంత్రి జూపల్లి
ప్రస్తుతం ఈ ఖాతాల్లో 40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు నిధులు ఉన్నాయి. అలా ప్రభుత్వ ఖజానా కార్యాలయాల అకౌంట్‌లో ఉన్న నిధులపై ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కన్ను పడింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పైరుతో చంద్రబాబు ఆ నిధులను వెనక్కి రప్పించే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌ను చంద్రబాబు సర్కార్ అన్ని డిపార్ట్‌మెంట్లకు జారీ చేసింది. దీంతో ప్రతి ప్రభుత్వ కార్యాలయం తన అకౌంట్‌లోని నిధులను తిరిగి చంద్రబాబు సర్కార్‌రుకు ఇవ్వనుంది.
3. ఇంజినీరింగ్ చదివిన ఒక్కో విద్యార్థి పేరుపై రూ.10 లక్షల ఆర్థిక దోపిడీ..!!
ఏపీలో ఇంజినీరింగ్ చదివిన ప్రతీ విద్యార్థి పేరుతో రూ.10 లక్షల ఆర్థిక దోపిడీకి పాల్పడేందుకు సీఎం చంద్రబాబు పెద్దప్లానే వేశారు. ఇంజినీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్ ఎవరైనా రోడ్డు మీద కనపడితే.. అతడికి రూ.10 లక్షల రూపాయలు నామినేషన్ వర్క్ మీద ఇచ్చే విధంగా చంద్రబాబు జీవో జారీ చేశారు. అయితే, నిజానికి చంద్రబాబు ఆ పది లక్షల రూపాలు ఇచ్చేది ఇంజినీరింగ్ చదివిన గ్రాడ్యుయేటర్‌కి కాదు.. పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ నాయకులకు, నేతలకు, కార్యకర్తలకు అన్న విషయం జగమెరిగిన సత్యమే.
see also : రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ విమర్శలు..మంత్రి జూపల్లి
ఇలా, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో వివిధ రూపాల్లో అవినీతి మార్గాలను అన్వేషిస్తున్న సీఎం చంద్రబాబు.. తన పాలనలో ఏపీని ఎలా ముందుకు తీసుకెళ్తారో ఆలోచించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది.