ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీకే నా ఓటు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దుర్మార్గపు పాలన, మహిళలపై అన్యాయాలు, దుర్మార్గాలు, అత్యాచారలు చేస్తూ టీడీపీ శ్రేణులు పైసాచిక ఆనందం పొందుతున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ కార్యక్రమం అవినీతే. అటువంటి అవినీతి పాలన నాకొద్దు. అందుకే నా వంతుగా నా ఓటును వైసీపీకే వేస్తానంటూ టాలీవుడ్‌లో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న పోసాని కృష్ణ మురళీ అన్నారు.
see also:వైఎస్ జగన్ కు గ్రీన్ సిగ్నల్..!!
కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు సర్కార్ అవినీతిని ఏకి పారేశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తేల్చి చెప్పారు. అంతే కాకుండా, గతంలో ఎన్టీఆర్‌ను విమర్శిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నా ఓటును వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కే వేస్తానంటూ పోసాని చెప్పడం కొసమెరుపు.