Home / 18+ / జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా ఎంట్రీకి భారీ ప్లాన్.. ముమ్మర ఏర్పాట్లు, చరిత్రలో నిలిచిపోయేలా

జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా ఎంట్రీకి భారీ ప్లాన్.. ముమ్మర ఏర్పాట్లు, చరిత్రలో నిలిచిపోయేలా

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల14న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుంది. గోదావరి బ్రిడ్జిపై, కృష్ణానదిపై జగన్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఎంట్రీపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ రూట్ మ్యాప్‌ను ఖ‌రారు చేశారు. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడి పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో 210 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని, 7 బహిరంగ సభల్లో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారని.. 25 రోజుల పాటు జిల్లాలో పర్యటన ఉంటుందని వెల్లడించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని 102 నియోజకవర్గాల్లో జగన్‌ పాదయాత్ర చేశారని, ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక నిర్ధిష్టమైన ప్రకటన చేస్తున్నారన్నారు. విశాఖ జిల్లా ప్రజలు జగన్‌ పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ఉవ్విళ్లూరుతున్నారట.. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేకహోదా కోసం ఐదుగురు వైసీపీ ఎంపీలు తమ14 నెలల పదవీ కాలాన్ని త్యాగం చేశారని, రాష్ట్ర హక్కులకోసం వైసీపీ నిరంతరం పోరాడుతునే ఉంటుందన్నారు. గిరిజన సమస్యలపై జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయనున్నారని, రైల్వేజోన్‌ అంశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఇప్పటివరకూ జగన్ పాదయాత్రల్లో కనిపించని అరుదైన ఘట్టాలు విశాఖలో కనిపించనున్నాయి. విశాఖ, భీమిలి వంటి సముద్రతీర ప్రాంతం వెంబడి ఓ వైపు మహాసముద్రం, మరోవైపు జగన్ అభిమానుల జన సముద్రంతో నిండిపోనుందట.. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. పర్యాటకరంగం పరంగా ఎంతో అందమైన ప్రాంతాల్లో జగన్ యాత్ర సాగుతుండడంతో ప్రజాసంకల్పయాత్ర అద్భుతంగా సుందరంగా జరగనుందని తెలుస్తోంది. జిల్లా ఎంట్రీ కూడా భారీగా ప్లాన్ చేసారట.

మన్యంవాసుల నృత్యాలు, పులి రాజుల ఊరేగింపులు, మేళతాలాలు, కోయ డ్యాన్సులు, డప్పుల వాయిద్యాలు, గంటలపాటు భారీ బాణసంచాలు పేల్చనున్నారట.. ఆదివాసీల ఆటపాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయట.. అలాగే నగరమంతా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లతో నింపేస్తున్నారట.. జిల్లాలో అడుగు పెడుతున్న సమయంలో సుమారు రెండు లక్షలమంది స్వాగతం స్వాగతం పలికేందుకు హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు. సముద్రతీరం వెంబడి పాదయాత్ర నిర్వహించే సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారట. ఈ అందమైన దృశ్యాలన్నీ డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. మొత్తమ్మీద జగన్ పాదయాత్రలో మరో అద్భుతఘట్టం ఆవిష్కరణ జరగనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat