వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉండే ఒక్క కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.ఆ కుక్క చుట్టుప్రక్కల కొత్తవారు ఎవరు కనిపించిన మొరుగుతుంది.అయితే హత్యకు ప్లానింగ్ లో ఉన్న దుండగులు ఆ శునకం వీళ్ళకు అడ్డుగా ఉంటుందని ముందుగానే ఊహించి దాని అడ్డు తొలిగించాలని హత్య చేసారు.అయితే ఇవ్వన్ని చూస్తుంటే దుండగులు పథకం ప్రకారమే వచ్చారని చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి.
