Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై మంత్రి బొత్స అదిరిపోయే సెటైర్..!

చంద్రబాబుపై మంత్రి బొత్స అదిరిపోయే సెటైర్..!

 ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కంటి చూపు మందగించందని..కంటి వెలుగు కార్యక్రమంలో ఓ సారి చెక్ చేయించుకుంటే బెటర్ అని మంత్రి బొత్స సెటైర్ వేశారు. ఇవాళ విశాఖలో పర్యటించిన సందర్భంగా గ్రామసచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు కార్యక్రమాలను తమ హయాంలోనే తీసుకువచ్చామని, వైసీపీ ప్రభుత్వం గొప్పేం లేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. బాబు విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బొత్స చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆదర్శ పాలన చూసి చంద్రబాబు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని..అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల హయాంలో యువతకు ఒక్క జాబ్ కూడా ఇవ్వని చంద్రబాబు గ్రామ సచివాలయ వ్యవస్థను, కంటి వెలుగు పథకాలను తామే తీసుకువచ్చామరని అబద్దాలు చెబుతున్నారని..ఆయనకు కంటి చూపు మందగించినట్లుందని, ఓసారి ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో చేయించుకుంటే బెటర్ అంటూ మంత్రి బొత్స సెటైర్ వేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే అమరావతిలో కట్టిన తాత్కాలిక సచివాలయం కాదు చంద్రబాబు అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని, అయినా సీఎం జగన్‌కు నీలా డబ్బాలు కొట్టడం రాదని…ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారని మంత్రి బొత్స అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను చూడాలని.. అంతేకాని కళ్లుండి కబోదిలా నటిస్తూ, గుడ్డిగా విమర్శలు చేస్తే ప్రజలు నవ్వుతారన్న సంగతి గుర్తుంచుకోవాలని మంత్రి బొత్స చంద్రబాబును హెచ్చరించారు. మొత్తంగా విశాఖలో చంద్రబాబు చేసిన విమర్శలకు మంత్రి బొత్స వేసిన సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు మతిభ్రమించిందని…ఇంకా సీఎం తానే అనే భ్రమలో బతుకుతూ…గ్రామసచివాలయ వ్యవస్థను, కంటి వెలుగును తానే ప్రారంభించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారంటూ..నిజంగా బాబుగారు ఓసారి తన కళ్లకు చెక్ చేయించుకుంటే బెటర్ అంటూ నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు.