Home / ANDHRAPRADESH / సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణమిదే!

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణమిదే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.. అయితే అనూహ్యంగా జగన్ డిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసేందుకు జగన్‌ ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నారు. ఆ అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా బిజీగా ఉన్నారు.. కొన్ని రోజులముందే జగన్, అమిత్ షాల మీటింగ్ కన్ఫర్మ్ అయింది. కానీ అనుకోకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి షా వెళ్లనున్నారు.. ఈ కారణంతోనే అమిత్ షా బిజీ అయ్యారు.  అందువల్ల ఢిల్లీ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. అయితే అమిత్ షా ను కలిసి సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించనున్నారు.