Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ… గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు జంప్..!

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ… గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు జంప్..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా కేవలం 23 మంది సీట్లకే పరిమితం అయింది. అయితే ఈ 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశాడు. వంశీ సీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా…ఎందుకనో ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇక ఉన్న 22 మందిలో మరో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ దూకడానికి సిద్దంగా ఉన్నారన్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. విశాఖ నార్త ఎమ్మెల్యే గంటా ఎప్పటి నుంచో పార్టీ మారబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారం ఎక్కడ ఉంటే ఆ పార్టీలో చేరి మంత్రి పదవి కొట్టేయడం గంటా స్టైల్.. ఈ విషయంలో గతంలో రెండుసార్లు గంటాకు వర్కవుట్ అయింది. అయితే ఈ సారి జగన్ ముందు గంటా పప్పులు ఉడకలేదు. దీంతో వైసీపీలో చేరే ప్రయత్నాలు మానుకుని బీజేపీలోకి వెళ్లేందుకు గంటా ప్రయత్నాలు మొదలెట్టాడు. ఈ మేరకు బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్న గంటా..ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌తో భేటీ అవుతున్న గంటా..తన రాజకీయ భవిష్యత్తుతో పాటు, వ్యక్తిగత ప్రయోజనాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. అయితే ఈ సందర్భంగా చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. గంటాతో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్పించేందుకు సుజనాచౌదరి రంగంలోకి దింపింది. సుజనా రాయబారంతో గంటా కూడా తనకు తగిన ప్రాధాన్యత కల్పిస్తే ఆ 9 మంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు సిద్ధం అని చెప్పినట్లు సమాచారం. గంటాతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, విశాఖ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, అనంతపురంకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబుకు ప్రతిపక్షహోదా కూడా గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat