Home / ANDHRAPRADESH / లోకేష్, బాబు, పవన్‌లపై వైసీపీ ఎంపీ అదిరిపోయే సెటైర్లు..!

లోకేష్, బాబు, పవన్‌లపై వైసీపీ ఎంపీ అదిరిపోయే సెటైర్లు..!

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్‌మెంట్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు దాదాపు 75 మంది ఎంపీలకు సీఎం రమేష్ ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ ఎంపీలంతా దాదాపుగా హాజరు కాగా…వైసీపీ నుంచి ఒకరిద్దరు మాత్రమే హాజరైనట్లు సమాచారం. సీఎం రమేష్‌తో నారా కుటుంబానికి ఉన్న గట్టి అనుబంధం దృష్ట్యా ఈ ఎంగేజ్‌మెట్‌కు నారా లోకేష్‌ కూడా హాజరైనట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో సీఎం రమేష్ కుటుంబసభ్యులతో లోకేష్ దిగిన ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు లోకేష్‌ బీజేపీ పెద్దలతో వ్యక్తిగతంగా కలిసి చర్చించినట్లు సమాచారం. అయితే తాజాగా దుబాయ్‌లో తాను దిగిన ఫోటోలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైకాపా పేటీఎమ్ బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తుంది. అకౌంట్ లో వైయస్ జగన్ గారి చిల్లర పడితే చాలు ఇంగిత జ్ఞానం లేకుండా రెచ్చిపోతున్నారు. సీఎం రమేష్ గారి కొడుకు పెళ్లికి లోకేష్ దుబాయ్ వెళ్లాడు అని.. 2015లో నేను అమెరికా పర్యటనకు వెళ్లిన పాత ఫొటోలతో కొత్త కథ అల్లారంటూ ట్వీటేసి మురిసిపోయాడు. అయితే జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేష్ ఇక్కడ కూడా టంగ్ స్లిప్పు అయ్యాడు. ఎంగే‌జ్‌మెంట్‌ను పెళ్లి అని చెప్పి నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోయాడు. లోకేష్ ట్వీట్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఆరు నెలల్లో నారాచంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే ఐదారుగురైనా మిగిలేది అనుమానమే. ఇక నారాలోకేష్ అయితే రెండోసారి ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండక పోవచ్చు. కేసులైనా తప్పించుకోవచ్చని బీజేపీ చంక ఎక్కడానికి చూస్తున్నారు అంటే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక లోకేష్ ట్వీట్‌పై స్పందిస్తూ.. తెలుగు ఉద్యమకారుడి అవతారం ఎత్తిన మాలోకానికి నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదు. గతంలో జయంతికి వర్ధంతికి బేధం తెలియకుండా మాట్లాడి అభాసుపాలయ్యాడు. మంగళగిరిలో చిత్తుగా ఓడినా ఏ మాత్రం తగ్గకుండా కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్నాడంటూ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. అలాగే మాతృభాషను కాపాడుకోవాలన్న మోదీ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలు ఏమని మాట్లాడుతారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్‌‌కు కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. నిత్య కళ్యాణం కామెంట్లు చూస్తుంటే బీజేపీలో విలీనానికి తెగ ఆరాట పడుతున్నట్టు తెలిసిపోతోంది. చంద్రబాబు అప్పగించిన పనిని దత్త పుత్రుడు శ్రద్ధగా చేస్తున్నాడు. ప్రయత్నం లోపంలేకున్నా అసలు చెల్లని కాసు పార్టీలను కలుపుకునేందుకు బీజేపీ అంగీకరిస్తుందో లేదో చూడాలంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లపై విజయసాయిరెడ్డి వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల‌్‌గా మారాయి.