Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఝలక్..ఇదే ఫైనల్ !

చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఝలక్..ఇదే ఫైనల్ !

మాటెత్తితే రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడే ధైర్యం చేయని టీడీపీ అధినేతకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆయనకు అతి భద్రత అవసరం లేదని కేంద్రం నిర్ణయించింది. చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోనే బ్లాక్ క్యాట్ భద్రలను కలిగి ఉన్న అతి తక్కువమంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు ఒకరుగా ఉన్నారు.

 

నక్సలైట్ల దాడిని ఎదుర్కొన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అపారమైన భద్రతను పొందుతూ ఉన్నారు. పన్నెండేళ్ల కిందటి నుంచి ఎన్ఎస్జీ చంద్రబాబుకు భద్రతను కల్పిస్తూ ఉంది. దీని కోసం మొత్తం 25 మంది అధికారులు చంద్రబాబుకు భద్రతగా ఉంటున్నారు.