Home / ANDHRAPRADESH / సీఎం జగన్‌తో భేటీ అయిన హైపవర్ కమిటీ.. అమరావతి రైతుల ఇష్యూ తేల్చేస్తారా..!

సీఎం జగన్‌తో భేటీ అయిన హైపవర్ కమిటీ.. అమరావతి రైతుల ఇష్యూ తేల్చేస్తారా..!

ఏపీలో పరిపాలనా, అధికార వికేంద్రీకరణ దిశగా ముందడుగు పడుతుందా…మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా.. రాజధాని రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు సర్కార్ చెక్ పడుతుందా..ఇవాళ సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ కానుండడంతో రాజధాని రగడకు ప్రభుత్వం త్వరలోనే పుల్‌స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.  తాజాగా ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్‌ కమిటీ సీఎం జగన్‌తో సమావేశం అయింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. గత కొద్ది రోజులుగా అధికార, పరిపాలనా వికేంద్రీకరణపై జీఎన్‌ రావు, బీసీజీ కమిటీల నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ సభ్యులు..ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌కు పవర్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. అలాగే నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతుల సమస్యలపై హైపవర్‌ కమిటీ సభ్యులు సీఎంతో చర్చించనున్నారు.

కాగా అధికార, పరిపాలనా వికేంద్రీకరణకే హైపవర్ కమిటీ కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం చేసే దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. భూములు తిరిగి తీసుకోవడానికి అంగీకరించిన రైతులకు భూములు ఇచ్చి కాస్త పరిహారం ఇవ్వడంతో పాటు అన్ని విధాల అండగా నిలబడడం, మరో వైపు ఆందోళనలు చేస్తున్న రైతుల సమస్యలను తేల్చేయాలని హైపవర్ కమిటీ సీఎం జగన్‌కు నివేదించినట్లు సమాచారం. మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తూనే.. అమరావతి రైతులు నష్టపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అమరావతి రైతుల ఆందోళనలకు ముగింపు పలకాలని జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. మరి సీఎంతో భేటీ తర్వాత హైపవర్ కమిటీ తమ నిర్ణయాలను మీడియాకు వివరించే అవకాశం ఉంది. అమరావతి రైతుల ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న వేళ..హైపర్ కమిటీ సీఎం జగన్‌తో భేటీ కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat