Home / ANDHRAPRADESH / అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఇజ్జత్ తీసిన మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్..!

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఇజ్జత్ తీసిన మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ కమీషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిపై చర్చకు పట్టుబట్టారు…జై అమరావతి నినాదాలతో సభను హోరెత్తించారు. టీడీపీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ…చంద్రబాబు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అధ్యక్షా…నవ్వడం ఓ రోగం.. నవ్వకపోవడం ఒక భోగం అంటారు..కాని టీడీపీ ఎమ్మెల్యేలకు నవ్వడం తెలియదు… ఇదే ఏడుపు ముఖంతోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు…జీవితమంతా ఇంతే..ఇప్పుడూ వాళ్లూ అలాగే ప్రవర్తిస్తున్నారు. రాగానే బ్యాడ్ మార్నింగ్ అంటున్నారని మంత్రి అనిల్ ఆక్షేపించారు. ఇక వాళ్ల నాయకుడు చంద్రబాబు కూడా ఎప్పుడూ ఏడుపు ముఖంతోనే ఉంటారు…ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్నారు…ఇప్పుడు జోలె పట్టుకుని పోతున్నారు…. టైమ్ అయ్యింది వెళ్లండి….అంటూ ఎద్దేవా చేశారు.

 

ఎస్సీ కమీషన్ బిల్లుపై మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ‘పసుపు- కుంకుమ’ పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి.. ఇప్పుడు సిగ్గు లేకుండా…ఏముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ…మండిపడ్డారు. కావాలనే ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చను అడ్డుకుంటున్నారు… గతంలోనూ అలాగే చేశారు.. అందుకే 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ.. ఏ పార్టీతో చేరుతుందో చెప్పండి. పొత్తు లేనిదే ముద్ద దిగని మీరా మాట్లాడుతున్నారు….వైసీపీ పొత్తు లేకుండాపోతుంది. మీలా కాదు…. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వెళతారు. సింగిల్‌గా పోయే ధైర్యం మీకు ఉందా… ఇక్కడున్న టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ము ఉందా.. ప్రమాణం చేస్తారా.. సింగిల్‌గా పోతామని మేం చెబుతున్నాం.. మీకు గొంతు లేవదు.. మూగబోయింది…తీవ్ర వ్యాఖ్యలు చేశారు..మొత్తంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడూ ఏడుపుగొట్టు ముఖమేనా అంటూ మంత్రి అనిల్ చంద్రబాబు ఇజ్జత్ తీసిపడేసారు.