Home / ANDHRAPRADESH / బాబూ..నీ డ్రామాలు నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్.. జొన్నలగడ్డ పద్మావతి అదిరిపోయే కౌంటర్…!

బాబూ..నీ డ్రామాలు నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్.. జొన్నలగడ్డ పద్మావతి అదిరిపోయే కౌంటర్…!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు, లోకేష్‌లు నానాయాగీ చేశారు. అమ్మభాషను చంపేస్తున్నారంటూ…బాబు, లోకేష్‌‌‌తో సహా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే తెలుగు భాషకు అన్యాయం జరుగబోతుంది అంటూ..పచ్చకథనాలు వండివార్చాయి. అయితే తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బిల్లును ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. మండలి తిరస్కరిస్తూ పలు సవరణలను సూచించింది. దీంతో మండలి చేసిన సవరణలను తిరస్కరిస్తూ ఈ బిల్లును మరోసారి అసెంబ్లీ ఆమోదించింది.

 

ఈ సందర్భంగా అసెంబ్లీలో ఇంగ్లిష్‌ మీడియంపై జరిగిన చర్చలో శింగనమల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ… చంద్రబాబు, లోకేష్‌‌లపై సెటైర్లు వేశారు. తొలుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారని పద్మావతి అన్నారు..ఈ సందర్భంగా ఆమె ఓ సినిమా డైలాగును ఉటంకించారు. ‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి..నీ నవ్వు వరం.. నీ కోపం శాపం. నీ మాట శాసనం’ అంటూ సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదివినంతమాత్రాన తెలుగు రాదనడం సరికాదని పద్మావతి చెప్పుకొచ్చారు.

 

ఇక తెలుగు మీడియంపై రాద్ధాంతాం చేసిన టీడీపీపై పద్మావతి స్పందిస్తూ… చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించడం లేదని, ఆయన డ్రామాలు నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌ అని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు, ఇంగ్లిష్‌.. రెండూ రావడం లేదని సెటైర్ వేశారు. మొత్తంగా ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌‌లపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వేసిన సెటైర్లు…సోషల్ మీడియాలో హాట్‌‌టాపిక్‌గా మారాయి,