Home / ANDHRAPRADESH / సొంత కులం మీద ఉన్న ప్రేమ కరోనా బాధితుల మీద లేదా చంద్రబాబు.. !

సొంత కులం మీద ఉన్న ప్రేమ కరోనా బాధితుల మీద లేదా చంద్రబాబు.. !

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.  కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకుగాను ప్రభుత్వాలకు సాయంగా పలువురు సినీ సెలబ్రటీలు,  పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు.  అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ,  దేశంలోనే నా అంతటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు ముష్టి విదిలించారు. తమ్ముళ్లు నా ఆస్తి లక్ష కోట్లు అని బహిరంగ సభలో ప్రకటించుకున్న చంద్రబాబు కరోనా విపత్తు వేళ  కనీసం కోటి రూపాయలు ఇవ్వలేక పోయాడంటే బాబుగారికి ఏపీ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇదే చంద్రబాబు అమరావతి లో తన సొంత సామాజిక వర్గం కోసం జోలె పట్టి ఊరూరా తిరుగుతూ కోట్లాది రూపాయలు సేకరించాడు. ఆ డబ్బులు ఏమయ్యాయో బాబుగారికే తెలియాలి.సొంత కులం ఆర్ధిక ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు సేకరించిన చంద్రబాబు కనీసం అందులో పావు వంతు కూడా కరోనా బాధితుల కోసం ఇవ్వలేకపోయాడు. చంద్రబాబు స్థాయికి కనీసం 10 కోట్లు అయినా ప్రకటించాలి. కానీ ముష్టి వేసినట్లు 10 లక్షలు విదిలించాడు. ఒక పక్క తన మిత్రుడు పవన్ కళ్యాణ్ తన దగ్గర పెద్దగా డబ్బులు లేకపోయినా పెద్ద మనసుతో 2 కోట్లు ఇచ్చాడు. పవన్ కంటే చంద్రబాబు కు ఏం తక్కువ. అయినా బాబుగారు అంతే. లాక్ డౌన్ వేళ చంద్రబాబు గారేమి జోలె పట్టి విరాళాలు సేకరించాల్సిన పని లేదు. కనీసం పార్టీ నుంచి ఫండ్స్ రెయిజ్ చేసినా బాగుండేది. బాబు గారి సామాజిక వర్గం పెద్దలు,  పార్టీ నాయకులు పోటీలు పడీ మరీ ఆన్ లైన్ ద్వారా అయినా కోట్లాది రూపాయలు కుమ్మరించేవారు కానీ బాబుగారు ఆ పని చేయడం లేదు.  అదే చంద్రబాబు అధికారం లో ఉంటే ఆ సీనే వేరుగా ఉండేది. ఈ పాటికి విరాళాల వెల్లువ ప్రవాహం లా  ఉండేది. ఎల్లో మీడియా కూడా పోటీలు పడీ మరీ కోట్లాది రూపాయలు సేకరించామని తెగ హడావుడి చేసేవి. ఇప్పుడు జగన్ సీఎం గా ఉండడంతో ఇంతటి విషమ పరిస్థితుల్లో కూడా   యెల్లో మీడియా చడీ చప్పుడు చేయడం లేదు. అదీ చంద్రబాబు,  అయన అనుకుల మీడియా తీరు. మొత్తంగా తన సొంత కులం మీద ఉన్న ప్రేమ ఏపీ ప్రజల మీద లేదని చంద్రబాబు మరోసారి రుజువు చేసుకున్నారు. బాబుగారి తీరే అంత…

 

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat