అవును మీరు విన్నది నిజమే.. కష్టపడి ఇల్లు కట్టుకున్నాడట. ఈ మాట అన్నది ఎవరో కాదండి.. స్వయాన ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేషే. కాగా, నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకం కింద ఒకే చోట నిర్మిస్తున్న ఐదువేళ ళ్లను నారా లోకేష్ ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇల్లు కట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు.. ఆ విషయం నేను సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు తెలిసిందని చెప్పారు. అలాగే చంద్రబాబు సింగపూర్ వెళ్లినప్పుడు ఏం చేస్తారో కూడా వెల్లడించారు మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లినప్పుడు అస్సలు నిద్రపోడట. పేద ప్రజలకు ఇళ్లను ఎలా నిర్మిస్తారు. ఇళ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, పరిశుభ్రతలో ఎటువంటి టెక్నాలజీ వాడుతారు. వంటి విషయాలపై దృస్టిపెడతారని చెప్పుకొచ్చారు నారా లోకేష్. అయితే, నారా లోకేష్ ఎప్పుడు ఇల్లు కట్టాడో ఏపీ ప్రజలకు అర్థం కావడం లేదు. ఈయన ఇల్లు ఎక్కడ, ఎప్పుడు కట్టుకున్నాడు అంటూ ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు.
