అవును మీరు విన్నది నిజమే. ఏపీ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు మంత్రి నారా లోకేష్ యూత్ ఐకానట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబూ.. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన పుత్ర రత్నంపై కురిపించిన ప్రశంసల జల్లు.
అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనసులోని మాటలు చెప్పారు. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రం సాంకేతికతలో దూసుకుపోయేలా అహర్నిశలు కృషి చేస్తుననారని, రాష్ట్రానికి ఐటీ కంపెనీలు వచ్చేలా లోకేష్ శతవిధాలా కృషి చేస్తున్నారని చెప్పారు. అంతటితో ఆగకుండా ఏపీ యూత్‌కే ఐకాన్‌లా నారా లోకేష్ మారాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడకుండానే అడ్డదారిల మంత్రి పదవి పొందిన నారా లోకేష్ యూత్‌కు ఐకాన్ ఎలా అవుతారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, కాకి పిల్ల కాకికే ముద్దు అన్న సామెతతో పోలుస్తూ.. చంద్రబాబూ.. మీ పుత్రరత్నం మీకు మద్దు కావచ్చు.. ఏపీ ప్రజలకు కాదుకదా..!! అయితే, ఏపీ యూత్‌కు ఐకాన్ అని మీరు చెబితే ఎలా..? యూత్‌కు లోకేష్‌కు మించిన ఐకాన్ ఏడా..? అంటూ నెలిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి మీరే చెప్పాలి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతుందో మరీ..!?