ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేత నాగేంద్ర అన్నారు. కాగా, ఇవాళ బీజేపీ నేత నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ అప్పులు ఒక్కసారిగా 2 లక్షలా 20 వేల కోట్ల 434 కోట్లు పెరిగిందన్నారు. ఈ లెక్క గత డిసెంబర్ వరకేనని, జనవరి, ఫిబ్రవరిలో ఇంకెంత అప్పు చేశారోనంటూ అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ నేత నాగేంద్ర. విశాఖపట్నంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో ఏ సంస్థను ప్రారంభించలేదని, అయితే, ఇప్పటి వరకు విశాఖలో ప్రారంభమైన సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినవేనన్నారు.
