ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇటు చంద్రబాబు, అటు మోడీ ప్రభుత్వాలు రెండూ కలిసి నట్టేట ముంచాయన్నారు. పోలవరం పేరుతో చంద్రబాబు సర్కార్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాడాల్సిన వ్యక్తి చేతగాని వ్యక్తిలా చూస్తూ ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు. అటు చంద్రబాబు నాయుడు పోరాడరు.. ఇటు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రజలను పోరాడనివ్వకుండా అరెస్టులు చేయించడం హేయమైన చర్య అన్నారు.
see also : పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
see also : రాజ్యసభ అభ్యర్థి వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా..!!
ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించడానికి నీకేం అధికారం ఉందంటూ సీఎం చంద్రబాబుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు నీ బాబు సొమ్మా.. లేక మీ అయ్య రాసిచ్చాడా..? అంటూ ప్రశ్నించారు ఉండవల్లి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా అడుగుంటే.. ఈ పాటికి వచ్చి ఉండేదని, చంద్రబాబు తనమీద ఉన్న కేసుల మాఫీ కోసమే బీజేపీతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం వద్ద చంద్రబాబు తాకట్టు పోట్టాడని చెప్పారు ఉండవల్లి అరుణ్‌కుమార్.