సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు.. A.P కి ప్రత్యేక హోదా జగనే తెస్తాడు ..!! అవును, ఐదుకోట్ల ఆంధ్రుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రతీ ఆంధ్రుడు తలెత్తుకు జీవించగలిగేలా రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఒక్క జగన్‌కే ఉంది. అంతేకాడు, 2014 ఎన్నికల్లో జగన్ కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబులాగా మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే అప్పుడే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ప్రజలను మోసం చేయడం తెలీదు కాబట్టే.. అమలుకు నోచుకునే హామీలు మాత్రమే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు డబ్బుతో ప్రజలను మభ్యపెట్టి, మద్యాన్ని నదిలా పారించి మోస పూరిత హామీలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా.. కేవలం రెండు శాతం ఓట్లతో వైఎస్ జగన్ ఓడిపోయారని, 2014 నుంచి ఇప్పటికీ ఒక సమర్ధవంతమైన నాయకుడిగా, చంద్రబాబు సర్కార్ అవినీతిని ఎండగడుతూ, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్న వైఎస్ జగన్‌కే ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే దమ్ము, ధైర్యం ఉన్నాయని చెప్పారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ.
see also : పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి కుంభకోణం..!!
కాగా, ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబుది రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్నారన్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలోనే చంద్రబాబు తీరు ఇలానే ఉందని, నేడు అదే సీన్ రిపీటవుతోందని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ నేతలచేత సినీ ఇండస్ర్టీపై విమర్శలు చేయిస్తున్నారని, నాడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేందుకు వచ్చిన సినీ నటులను జైల్లో ఉంచిన ఘటనలు మరిచిపోయావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు తమ్మారెడ్డి భరద్వాజ. నాడు, వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు, వైఎస్ జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు అక్రమంగా కేసులు బనాయించినా.. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న ధీటైన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. నాటి రోజుల్లాగే.. నేడు కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా తీసుకురాగల సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ తనదైన సినీ డైలాగ్‌లతో జగన్‌పై తన అభిప్రాయాన్ని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ.
see also :