ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. కోటాను కోట్లు ప్రజా ధనాన్ని పోసి, ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీవెంత నీ బతుకెంత..? ఆంధ్రప్రదేశ్‌ను అవినీతాంధ్రప్రదేశ్ చేసిన నీవు బీజేపీని, ప్రధాని మోడీని విమర్శిస్తావా..? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైరయ్యారు.
see also : రమణ దీక్షితులు షాకింగ్ డెసిషన్ .ఆందోళనలో చంద్రబాబు ..!
కాగా, సోమవారం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలో బీజేపీ అత్యధికంగా 104 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మరో 7 ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని వదలుకున్న విషయాన్ని గుర్తు చేశారు విష్ణుకుమార్ రాజు.
see also : అలిపిరి అమిత్ షాపై దాడిలో షాకింగ్ ట్విస్ట్ ..!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెలుగుశం అనుసరించిన ఎమ్మెల్యేల కొనుగోలు విధానాన్ని మేం అనుసరించలేదని, అందుకనే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. చంద్రబాబులా మేము కూడా వ్యవహరించి ఉంటే.. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఉండేదని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీలా కుట్రలు, వెన్నుపోటు, కుతంత్రాలు పన్నే విధానం మాది కాదంటూ తెలుగు తమ్ముళ్లకు చురకలంటించారు ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు.