వందలకోట్ల రూపాయలకు ఎంపీ సీట్లను అమ్ముకున్న నువ్వెంత..? నీ బతుకెంత..? అంటూ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి, టీడీజీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అనుచరులుగా నేను (మోత్కుపల్లి నర్సింహులు), ముద్దు కృష్ణమనాయుడు, ఇంకా కొంత మందిమి ఉన్నామన్నారు. చంద్రబాబు చేసిన, చేస్తున్న కుట్రలను మాతో చెప్పి బాధపడే వారని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణానికి ముఖ్యకారణం ముమ్మాటికి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు కుట్రలకు ఎన్టీఆర్ బలయ్యారన్నారు. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో తెలంగాణ ముఖ్యమంత్రికి చంద్రబాబు సరెండర్ అయ్యారని మోత్కుపల్లి నర్సింహులు దుయ్యబట్టారు.