Home / ANDHRAPRADESH / వైఎస్ జ‌గ‌న్‌పై ఎంపీ ముర‌ళీ మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ జ‌గ‌న్‌పై ఎంపీ ముర‌ళీ మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుంతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌గ‌న్ కు వారి స‌మ‌స్య‌లు చెప్పుకుని విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు విన్న‌వించి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం వారిలో భ‌రోసా క‌ల్పిస్తూ పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు.

see also;ఏపీ పోలీసులు.. ముళ్ల కంచెలను అడ్డుగా వేసిన..వైఎస్ జగన్ పాదయాత్రలో జనం

అయితే, ప్రజా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిపై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇవాళ టీడీపీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్ స్పందించారు. తాను త‌ప్పు చేశాన‌ని నిరూపిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ఎంపీ ముర‌ళీ మోహ‌న్ స‌వాల్ విసిరారు.

see also:వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు

స్వాతంత్య్ర ఉద్య‌మంలో పోరాడిన కుటుంబం మాది. ఒక నీతికి, నిజాయితీకి క‌ట్టుబ‌డ్డ కుటుంబం మాది. అటువంటి నాపై విమ‌ర్శ‌లు చేస్తావా..? ఆ అర్హ‌త కూడా నీకు లేదంటూ జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. మీ నాన్న ఒకానొక స‌మ‌యంలో ఇంటిని అమ్మేందుకు సిద్ధ‌ప‌డ్డాడు. అటువంటి వ్య‌క్తి అధికారంలోకి రాగానే ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డాడు. కోట్ల రూపాల ప్ర‌జా సంపాద‌న‌ను కొల్ల‌గొట్టాడు. ఆ అవినీతి సొమ్మును ఇప్పుడు నీవు అనుభ‌విస్తున్నావంటూ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాకుండా, అవినీతి కేసుల్లో 16 నెల‌ల‌పాటు జైల్లో ఉన్నావు. అటువంటి నీవు న‌న్నే విమ‌ర్శిస్తావా..? అంటూ జ‌గ‌న్‌పై ఫైర‌య్యారు.

see also:మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా..ఈ నెల 20న భారీ ర్యాలీతో వైసీపీలోకి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat