ప్రజా సంకల్ప యాత్ర. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన యాత్ర. గత సంవత్సరం నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర నేటితో 200 రోజుకు చేరుకుంది.
see also:
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ, వారిలో ఒకరిగా ఉంటూ ముందుకు కదులుతున్నారు. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను స్వయంగా చూస్తున్న జగన్.. సమస్యల పరిష్కారానికి తానేమి చేయబోతున్నానని చెప్పడమే కాదు, నవ రత్నాలు ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతానని స్పష్టమైన హామీలు ఇస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు వైఎస్ జగన్.
see also:పాదయాత్ర 200వ రోజు సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్
జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా జగన్ అడుగులో అడుగు వేస్తూ ప్రజలు నడుస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రతో పల్లెలు, పట్టణ ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారికి భరోసా కల్పిస్తూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు జగన్.. 200వ రోజు ప్రజా సంకల్ప యాత్ర రోజున జగన్ అంటూ ఫోటోను డిజైన్ చేసిన అభిమానులు నెట్టింట్లో పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
see also:వేల మీటర్ల ఎత్తు నుండి దూకిన జగన్..!ఎందుకంటే..!
ఓ సారి ఆ కామెంట్లను పరిశీలిస్తే..
నాడు దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ ప్రజారంజక పాలన చేస్తే.. నేడు అదే పాలన అందించగల నాయకుడు వైఎస్ జగన్.
2019లో జగనే ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ ప్రజా నాయకుడు
జగన్ ముఖ్యమంత్రి అయితేనే.. ప్రతీ పేదవాడికి బతుకు బాగుపడుతుంది. ఇలా ఒక్కొక్కరు కామెంట్లు పెట్టడం గమనార్హం.