వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా మస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలు జగన్‌పై పూలవర్షం కురిపిస్తూ.. జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారిలో తానున్నానన్న భరోసాను కల్పిస్తూ ముందకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే తొమ్మిది జిల్లాలను దాటుకొని.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ జగన్ తన పాదయాత్రను ముమ్మడివరంలో చేస్తున్నారు. జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తూ తమ ప్రాంతానికి వచ్చారని తెలుసుకున్న ప్రజలు అశేషంగా తరలి వచ్చారు. జగన్‌ను చూసేందుకు.. జగన్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇదే క్రమంలో వైఎస్ జగన్‌ను ఏపీ సీపీఎస్ నేతలు కలిశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జగన్‌ను కోరారు. వెంటనే స్పందించిన వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి రాగానే.. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో జగన్‌ను కలిసిన ఏపీ సీపీఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.